Page Loader
Arvind Kejriwal: రేపు సాయంత్రం సీఎం పదవికి రాజీనామా.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన కేజ్రీవాల్
రేపు సాయంత్రం సీఎం పదవికి రాజీనామా.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన కేజ్రీవాల్

Arvind Kejriwal: రేపు సాయంత్రం సీఎం పదవికి రాజీనామా.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన కేజ్రీవాల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 16, 2024
05:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా‌తో మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు సమావేశం కానున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలిపింది. కేజ్రీవాల్‌ తన రాజీనామాను అప్పుడే సమర్పించవచ్చని సమాచారం. కేజ్రీవాల్ రాజీనామా చేసిన తర్వాత, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఆప్ సీనియర్ నేతలు ఒక సమావేశం నిర్వహించారు.

Details

ముఖ్యమంత్రి రేసులో అతీషీ, గోపాల్‌ రాయ్, సునీత కేజ్రీవాల్

ఈ రోజు ఉదయం మనీశ్‌ సిసోడియా, రాఘవ్‌ చడ్డా కేజ్రీవాల్‌ను కలిశారు. ఇక ఎన్నికల వరకు పార్టీ నేతల్లో ఒకరిని ముఖ్యమంత్రిగా నియమించనున్నట్లు కేజ్రీవాల్ గత ఆదివారం వెల్లడించారు. ప్రజలు తనతో పాటు సిసోడియా విశ్వసనీయతకు మద్దతుగా ఉన్నారని, మధ్యంతర ఎన్నికల ద్వారా తన విశ్వసనీయతను మరింత బలపడాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేజ్రీవాల్‌ రాజీనామా ప్రకటన తర్వాత సీఎం పదవికి కొత్త వ్యక్తి ఎవరవుతారని చర్చ మొదలైంది. ముఖ్యమంత్రిగా అతీషీ, గోపాల్‌ రాయ్, సునీత కేజ్రీవాల్ వంటి ప్రముఖుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. దళిత లేదా మైనారిటీ వర్గానికి చెందిన నేతను సీఎం చేసే అవకాశాలు లేకపోలేదు.