Page Loader
Delhi: ఢిల్లీలో సోదాలకు వెళ్లిన ఈడీ అధికారులఫై భౌతిక దాడి..!
ఢిల్లీలో సోదాలకు వెళ్లిన ఈడీ అధికారులఫై భౌతిక దాడి..!

Delhi: ఢిల్లీలో సోదాలకు వెళ్లిన ఈడీ అధికారులఫై భౌతిక దాడి..!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 28, 2024
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈడీ (ED) అధికారులు సోదాలు చేపట్టేటప్పుడు అనూహ్య సంఘటన ఎదురైంది. కొన్ని గుర్తుతెలియని దుండగులు సోదాలు జరుపుతున్న అధికారులపై దాడికి దిగారు. ఈ ఘటన ఢిల్లీలోని బిజ్వాసన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఈడీ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈడీ (ED)లోని హై-ఇంటెన్సిటీ యూనిట్ (HIU) అధికారులు దేశవ్యాప్తంగా ఉన్న సైబర్‌క్రైమ్ నెట్‌వర్క్‌లకు సంబంధించి ఛార్టెడ్ అకౌంటెంట్స్‌పై సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో, దిల్లీలోని బిజ్వాసన్‌ ప్రాంతంలోని ఓ ఫామ్‌ హౌస్‌లో సోదాలు చేస్తున్నప్పుడు ఐదుగురు దుండగులు అధికారులపై ఫర్నీచర్‌తో దాడికి దిగారు.

వివరాలు 

ఘటనపై అధికారులు కేసు నమోదు

ఈ దాడిలో ఈడీ అదనపు డైరెక్టర్‌ గాయపడ్డారు. దుండగులు ఘటనా స్థలాన్ని వదిలి పారిపోయారు. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సోదాలు క్యూఆర్ కోడ్, పిషింగ్, పార్ట్‌టైమ్ జాబ్స్ వంటి స్కామ్స్‌తో సంబంధం కలిగి ఉన్న వేలాది సైబర్ క్రైమ్‌ల నుండి అక్రమ నిధులను వెలికితీయడంపై దృష్టి పెట్టినట్లు ఈడీ అధికారులు తెలిపారు.