Page Loader
1,600 కోట్ల మోసం కేసులో అశోకా యూనివర్సిటీ వ్యవస్థాపకుల ప్రాంగణాలపై ఈడీ దాడులు
అశోకా యూనివర్సిటీ వ్యవస్థాపకుల ప్రాంగణాలపై ఈడీ దాడులు

1,600 కోట్ల మోసం కేసులో అశోకా యూనివర్సిటీ వ్యవస్థాపకుల ప్రాంగణాలపై ఈడీ దాడులు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2023
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

అశోకా యూనివర్సిటీ వ్యవస్థాపకులకు సంబంధించి మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద నమోదైన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శుక్రవారం దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు విశ్వసనీయ వర్గాలు జాతీయ మీడియాకి తెలిపాయి. పారాబొలిక్ డ్రగ్స్ కేసులో దిల్లీ, ముంబై, చండీగఢ్, పంచకుల, అంబాలా కేంద్రంగా 17 ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించారు. ఈ కేసులో, పారాబొలిక్ డ్రగ్స్ లిమిటెడ్,దాని డైరెక్టర్లు/ప్రమోటర్లు, ప్రణవ్ గుప్తా, వినీత్ గుప్తా రూ. 1,600 కోట్ల విలువైన బ్యాంక్ మోసానికి పాల్పడ్డారని వర్గాలు తెలిపాయి. అశోకా యూనివర్సిటీ వ్యవస్థాపకులు వినీత్ గుప్తా, ప్రణవ్ గుప్తా అని విచారణలో తేలింది.దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అశోకా యూనివర్సిటీ వ్యవస్థాపకుల ప్రాంగణాలపై ఈడీ దాడులు