Delhi Liquor case: ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఈడీ సంచలనం.. కేసులో ఆప్‌ని నిందితుడిగా చేర్చనున్న విచారణ సంస్థ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుడిగా చేర్చేందుకు సిద్ధమవుతున్నట్లు ఈడీ మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. ఒక రాజకీయ పార్టీని ఒక కేసులో నిందితుడిగా చేర్చడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా,ఈ కేసులో అనుబంధ ఛార్జిషీట్‌ను త్వరలో దాఖలు చేయనున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలియజేసింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువుర్నిఈడీ అరెస్ట్ చేసింది. ఆ తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను,అటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ కస్టడీ అనంతరం కవితను,కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు తరలించారు.