LOADING...
Ration Scam: రేషన్ కుంభకోణం కేసు.. కోల్‌కతాలో ఈడీ దాడులు 
Ration Scam: రేషన్ కుంభకోణం కేసు.. కోల్‌కతాలో ఈడీ దాడులు

Ration Scam: రేషన్ కుంభకోణం కేసు.. కోల్‌కతాలో ఈడీ దాడులు 

వ్రాసిన వారు Stalin
Feb 13, 2024
12:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన కోట్లాది రూపాయల రేషన్ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫోకస్ పెట్టింది. ఈ కేసు విచారణకు సంబంధించి మంగళవారం ఉదయం ఈడీ అధికారులు కోల్‌కతాలోని పలు చోట్ల దాడులు చేపట్టారు. సాల్ట్‌లేక్‌, కైఖలి, మీర్జా గాలిబ్‌ స్ట్రీట్‌, హౌరా తదితర ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో పాటు ఈడీ బృందాలు దాడులు నిర్వహించాయని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. విచారిస్తున్న వారిలో వ్యాపారవేత్తలు, స్కామ్‌లో గతంలో అరెస్టయిన నిందితులకు సన్నిహితులు కూడా ఉన్నారని ఆయన చెప్పారు. నార్త్ 24 పరగణాస్ జిల్లాలో ఫారెక్స్ వ్యాపారి సహా ముగ్గురి నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ స్కామ్‌లో విదేశాల్లోని వివిధ ఖాతాలకు డబ్బు మళ్లించినట్లు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోదాలు నిర్వహిస్తున్న ఈడీ అధికారులు