Hemant Soren: ఈడీ అరెస్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన హేమంత్ సోరెన్
మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోరెన్ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సోరెన్ అరెస్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ చేసిన పిటిషన్‌ను దాఖలు చేశారు. సిబల్ దాఖలు చేసిన.. పిటిషన్‌పై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ. వేల మందిని ఈడీ అరెస్టు చేసిందని, అందరూ సుప్రీంకోర్టుకు రాలేరన్నారు. సొలిసిటర్ జనరల్‌కు సిబల్ సమాధానమిస్తూ.. ఎన్నికలకు ముందు అరెస్టు చేయడం వల్లే తాము సుప్రీంకోర్టుకు వచ్చినట్లు తెలిపారు. భూ కుంభకోణం కేసులో ఆరోపణలపై బుధవారం ఏడు గంటల పాటు విచారించిన తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోరెన్‌ను అరెస్టు చేసింది.