LOADING...
ED: డంకీ రూట్ గ్యాంగ్‌పై ED భారీ దాడులు.. రూ.4 కోట్లకు పైగా నగదు,313కిలోల వెండిని స్వాధీనం  
రూ.4 కోట్లకు పైగా నగదు,313కిలోల వెండిని స్వాధీనం

ED: డంకీ రూట్ గ్యాంగ్‌పై ED భారీ దాడులు.. రూ.4 కోట్లకు పైగా నగదు,313కిలోల వెండిని స్వాధీనం  

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 19, 2025
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

అక్రమంగా విదేశాలకు పంపించే డంకీ రూట్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పెద్ద ఎత్తున దాడులు చేసింది. డిసెంబర్ 18న ED జలంధర్ జోనల్ టీమ్ పంజాబ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో ఒకేసారి 13 చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో, ఢిల్లీలో ఉన్న ఒక ట్రావెల్ ఏజెంట్ దగ్గర నుంచి రూ.4.62 కోట్ల నగదు, 313 కిలోల వెండి, 6 కిలోల బంగారు బిస్కెట్లు ED స్వాధీనం చేసుకుంది. వీటి మొత్తం విలువ సుమారు రూ.19.13 కోట్లుగా అంచనా వేస్తున్నారు.

వివరాలు 

సోదాల్లో EDకి ఏమేం దొరికాయి?

హర్యానాలో దొరికిన పత్రాల ద్వారా, మెక్సికో మార్గం ద్వారా అమెరికాకు పంపేందుకు ప్రజల ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టించేవారని సమాచారం. డబ్బు నష్టపోకుండా ఉండేందుకే ఇలా గ్యారంటీగా తీసుకునేవారని ED చెబుతోంది. ఈ గ్యాంగ్ ఎలా బయటపడింది? ఈ ఏడాది ఫిబ్రవరిలో ED ఈ కేసు దర్యాప్తు మొదలుపెట్టింది.అప్పట్లో అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 330 మంది భారతీయులను కార్గో విమానం ద్వారా దేశం నుంచి పంపించింది. వాటికి సంబంధించి నమోదైన వేర్వేరు FIRల ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ED విచారణ ప్రారంభించింది. విచారణలో,వాళ్లను డంకీ రూట్ ద్వారా అమెరికాకు పంపించి, దానికి బదులుగా కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తెలిసింది.ఈ గ్యాంగ్ కార్యకలాపాలు అనేక రాష్ట్రాల్లో వ్యాపించి ఉన్నాయి.

వివరాలు 

ఈ గ్యాంగ్‌లో ఎవ్వరెవరు ఉన్నారు?

ED దర్యాప్తులో, ట్రావెల్ ఏజెంట్లు, స్థానిక మధ్యవర్తులు, డంకర్లు (మార్గం మధ్యలో తీసుకెళ్లే ఏజెంట్లు), హవాలా ఆపరేటర్లు, ఉండేందుకు-రవాణా ఏర్పాట్లు చేసే వాళ్లు—ఇలా చాలా మంది ఇందులో ఉన్నట్టు తేలింది. ED దాడులు జరిగిన చోట్లలో జలంధర్‌లో రిచీ ట్రావెల్స్, ఢిల్లీలో తరుణ్ ఖోస్లా, పానిపట్‌లో బల్వాన్ శర్మ పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి. మొత్తం వ్యవస్థ అక్రమ సంపాదనపై నడుస్తోందని ED చెబుతోంది.

Advertisement

వివరాలు 

ముందే రూ.5.41 కోట్ల ఆస్తుల జప్తు

డిసెంబర్ 15న, ఇదే కేసులో ED రూ.5.41 కోట్ల విలువైన చర, స్థిర ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఇవి శుభమ్ శర్మ, జగజీత్ సింగ్, సుర్ముఖ్ సింగ్ అనే ఏజెంట్లు అక్రమంగా ప్రజలను అమెరికాకు పంపి సంపాదించిన నేర ఆదాయానికి సమానమని తెలిపింది. జప్తు చేసిన ఆస్తుల్లో వ్యవసాయ భూములు, నివాస-వాణిజ్య భవనాలు, అలాగే ఈ ఏజెంట్లు, వారి కుటుంబాల పేర్లపై ఉన్న బ్యాంక్ ఖాతాలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా మొబైల్ చాట్లు, డిజిటల్ ఆధారాలు కూడా దొరికాయి. వాటిలో డంకీ రూట్‌కు సంబంధించిన ఇతర సభ్యులతో టికెట్లు, రూట్లు, డబ్బు డీల్స్ గురించి జరిగిన చర్చలు ఉన్నాయి.

Advertisement