Vizag: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్.. రూ.44.74 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన ఆడిటర్ జీవీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది.
హయగ్రీవ ఫామ్స్‌కు చెందిన రూ.44.74 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
హయగ్రీవ భూముల అమ్మకాల్లో ఎంవీవీ, ఆయన ఆడిటర్ జీవీ, అలాగే మేనేజింగ్ పార్టనర్ గద్దె బ్రహ్మాజీలు కీలక పాత్ర పోషించినట్లు ఈడీ తన దర్యాప్తులో వెల్లడించింది.
ప్లాట్లు విక్రయించి దాదాపు రూ.150 కోట్లు సంపాదించినట్లు గుర్తించింది.
గతేడాది అక్టోబరులో ఎంవీవీ, జీవీ నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.
ఆ సోదాల సందర్భంగా నకిలీ పత్రాలను తయారు చేసే డిజిటల్ పరికరాలు, వివిధ కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది.
వివరాలు
హయగ్రీవ భూముల్లో కుంభకోణం
విశాఖపట్టణంలోని హయగ్రీవ భూముల్లో చోటుచేసుకున్న కుంభకోణాన్ని ఈడీ బట్టబయలు చేసింది.
వృద్ధులు, అనాథల సేవల కోసం కేటాయించిన భూములను వైసీపీ నేతలు అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
ఎండాడలోని హయగ్రీవ ప్రాజెక్టుకు సంబంధించిన 12.51 ఎకరాల భూమిని మోసపూరితంగా కబ్జా చేసినట్లు గతేడాది జూన్ 22న చిలుకూరు జగదీశ్వరుడు, ఆయన భార్య రాధారాణి ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఆ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తును ప్రారంభించింది.