Page Loader
ఈడీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ప్రతీకార చర్యలకు పాల్పడొద్దని సూచన 
ఈడీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ప్రతీకార చర్యలకు పాల్పడొద్దని సూచన

ఈడీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ప్రతీకార చర్యలకు పాల్పడొద్దని సూచన 

వ్రాసిన వారు Stalin
Oct 04, 2023
03:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. కేసులను దర్యాప్తు చేసే సమయంలో ప్రతీకార చర్యలకు పాల్పడొద్దని చెప్పింది. దర్యాప్తును పారదర్శకంగా, చట్టప్రకారమే చేయాలని ఆదేశించింది. మనీలాండరింగ్‌ చట్టం కింద అరెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వ్యవహరించాలని, తగిన ఆదారాలను సేకరించిన తర్వాత అదుపులోకి తీసుకోవాలని సూచించింది. నోటీసులకు స్పందించలేదని అదుపులోకి తీసుకోవడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. గురుగ్రామ్‌కు చెందిన ఎం3ఎం కంపెనీపై నమోదైన మనీలాండరింగ్‌ కేసు పిటిషన్ విచారణ సందర్భంగా ఆ కంపెనీ డైరెక్టర్ల అరెస్టును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఈ కీలక సూచనలు చేసింది.

సుప్రీంకోర్టు

కేసు నేపథ్యం ఇదీ.. 

మనీలాండరింగ్‌‌కు సంబంధించిన కేసులో ఎం3ఎం డైరెక్టర్లు బసంత్‌ బన్సల్‌, పంకజ్‌ బన్సల్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తు భాగంగా బసంత్‌ బన్సల్‌, పంకజ్‌ బన్సల్‌ ఇళ్లు, ఆఫీసులో జూన్‌ 1న ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం బన్సల్‌ సోదరులు ముందస్తు బెయిల్ కోసం పంజాబ్‌-హరియాణా హైకోర్టును ఆశ్రయించారు. అయితే జులై 5 వరకు వారిని అరెస్టు చేయొద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గడువు ముగిసిన తర్వాత హైకోర్టు ఆదేశాలతో ఈడీ అధికారులు బన్సల్ సోదరులను ఆరెస్ట్ చేశారు. అనతంరం బన్సల్ సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేసింది.