Page Loader
ఆప్ నేత సంజయ్ సింగ్‌కు ఐదు రోజుల ఈడీ రిమాండ్  

ఆప్ నేత సంజయ్ సింగ్‌కు ఐదు రోజుల ఈడీ రిమాండ్  

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 05, 2023
07:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు అక్టోబర్ 10 వరకు రిమాండ్‌కు పంపింది. సంజయ్ సింగ్‌ ఢిల్లీ నివాసంలో ఈడి అధికారులు ఒకరోజు పాటు విచారించిన అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) గురువారం ఆయనను అరెస్టు చేసింది. ఈడీ పది రోజుల రిమాండ్ కోరగా, కోర్టు ఐదు రోజుల రిమాండ్ ఇచ్చింది. ఢిల్లీ అధికార పార్టీ నుంచి ఏడాది వ్యవధిలో ఏజెన్సీ అరెస్టు చేసిన మూడో వ్యక్తిగా ఆప్ సీనియర్ నేత నిలిచారు. మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లు వేర్వేరు కేసుల్లో ఇప్పటికే కటకటాల వెనుక ఉన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆప్ నేత సంజయ్ సింగ్‌కు ఐదు రోజుల ఈడీ రిమాండ్