
మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత అమానతుల్లా ఖాన్ ఇంట్లో సోదాలు
ఈ వార్తాకథనం ఏంటి
మనీలాండరింగ్ కేసులో దిల్లీలోని ఆప్ నేత అమానతుల్లాఖాన్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం సోదాలు నిర్వహించింది.
దిల్లీలోని అవినీతి నిరోధక బ్యూరో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా అమానతుల్లా ఖాన్‌పై ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభించింది.
దిల్లీ వక్ఫ్ బోర్డు రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలకు సంబంధించి ఖాన్‌ను గతేడాది ఏసీబీ అరెస్ట్ చేసి, సెప్టెంబర్‌లో బెయిల్ మంజూరు చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అమానతుల్లా ఖాన్ ఇంట్లో సోదాలు
Enforcement Directorate (ED) raids Aam Aadmi Party (AAP) MLA Amanatulla Khan in money laundering case: Sources
— ANI (@ANI) October 10, 2023
Details
నిబంధనలను,ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లఘించి అక్రమ రిక్రూట్మెంట్
ఖాన్ ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్న సమయంలో అన్ని నిబంధనలను, ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ 32 మందిని అక్రమంగా రిక్రూట్ చేసుకున్నారని ఆరోపించిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది.
ఫిర్యాదులో ఆయనపై అవినీతి, పక్షపాతం ఆరోపణలు కూడా ఉన్నాయి.