Page Loader
Land-For-Jobs Case: విచారణ కోసం ఈడీ ఆఫీస్‌కు లాలూ ప్రసాద్ యాదవ్ 
Land-For-Jobs Case: విచారణ కోసం ఈడీ ఆఫీస్‌కు లాలూ ప్రసాద్ యాదవ్

Land-For-Jobs Case: విచారణ కోసం ఈడీ ఆఫీస్‌కు లాలూ ప్రసాద్ యాదవ్ 

వ్రాసిన వారు Stalin
Jan 29, 2024
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో ఆర్జేడీ అధినేత, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం ఉదయం బిహార్‌ పాట్నలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. లాలూ తన కుమార్తె మిసా భారతితో కలిసి దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వచ్చారు. విచారణ కోసం జనవరి 19న ఈడీ సమన్లు జారీ చేసింది. లాలూ యాదవ్ కుమారుడు, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు కూడా ఈడీ సమన్లు ​​పంపింది. జనవరి 30న తేజస్వీ యాదవ్‌ను ఈడీ విచారించనుంది. ఈ క్రమంలో మంగళవారం తేజస్వి దిల్లీలోని దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వెళ్లనున్నారు. గతేడాది డిసెంబర్ 27న లాలూను, డిసెంబర్ 22న తేజస్వీని విచారణకు రావాలని ఈడీ సమన్లు పంపినా.. హాజరు కాలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఈడీ ఆఫీస్‌లో లాలూ యాదవ్