LOADING...
Anil Ambani: అనిల్ అంబానీ 3,000 కోట్ల రుణ మోసం కేసు..  బిస్వాల్ ట్రేడ్లింక్‌ ఎండీ అరెస్ట్
అనిల్ అంబానీ 3,000 కోట్ల రుణ మోసం కేసు.. బిస్వాల్ ట్రేడ్లింక్‌ ఎండీ అరెస్ట్

Anil Ambani: అనిల్ అంబానీ 3,000 కోట్ల రుణ మోసం కేసు..  బిస్వాల్ ట్రేడ్లింక్‌ ఎండీ అరెస్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 02, 2025
07:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

అనిల్ అంబానీకి చెందిన వ్యాపార సంస్థలపై మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో తొలిసారి అరెస్ట్ జరగగా,భువనేశ్వర్‌కు చెందిన బిస్వాల్ ట్రేడ్లింక్ ప్రైవేట్ లిమిటెడ్ (BTPL) మేనేజింగ్ డైరెక్టర్ పార్థ సారథి బిస్వాల్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)-2002 కింద ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుకు ముందు రోజే భువనేశ్వర్,కోల్‌కతాలోని BTPL ఆఫీసులపై ఈడీ విస్తృతంగా సోదాలు నిర్వహించింది. ఈ కేసు ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం(EOW)నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా వెలుగులోకి వచ్చింది. ఇందులో BTPL, ఆ సంస్థ డైరెక్టర్లు ఇతరులపై సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI)కు నకిలీ బ్యాంకు గ్యారంటీ సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

వివరాలు 

రిలయన్స్ పవర్ లిమిటెడ్ నుంచి రూ.5.4కోట్లు 

ఈడీ చెబుతున్న వివరాల ప్రకారం,BTPL సుమారు ₹68.2 కోట్ల విలువైన నకిలీ బ్యాంక్ గ్యారంటీలు ఏర్పాటు చేసింది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)పేరిట నకిలీ అంగీకార పత్రాలు,స్పూఫ్ చేసిన ఈమెయిల్‌ ఐడీలతో చేసిన ఫేక్ కన్ఫర్మేషన్ మెయిళ్లు ఉపయోగించారట.ఈగ్యారంటీ SECI టెండర్‌కు సపోర్ట్‌గా సమర్పించబడినట్టు ఈడీ వెల్లడించింది. ఇందులో కీలకంగా,బిస్వాల్ ట్రేడ్లింక్‌కు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ లిమిటెడ్ నుంచి రూ.5.4కోట్లు వచ్చాయని ఈడీ గుర్తించింది. ఈ ఫైనాన్షియల్ లింక్‌ వల్లే అంబానీ కంపెనీ నెట్‌వర్క్‌తో నకిలీ గ్యారంటీ వ్యవహారం కలిపి చూపించినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే,2019లో స్థాపితమైన ఈచిన్న కంపెనీ చాలా గోప్యంగా బ్యాంకు ఖాతాలు నిర్వహించి,దాని ఆదాయానికి సంబంధం లేకుండా భారీ లావాదేవీలు నిర్వహించినట్టు విచారణలో బయటపడింది.

వివరాలు 

ఆగస్టు 5న విచారణకు అనిల్ అంబానీ

ఇప్పటివరకు కనీసం ఏడుగురు ఫేక్ డైరెక్టర్ల పేరుతో డబ్బుల లావాదేవీలు జరిపినట్టు గుర్తించారు. మరింతగా, కంపెనీ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో అక్కౌంట్స్ బుక్స్, షేర్ హోల్డర్ రిజిస్టర్లు లేకపోవడం, అనేక కాగితాలు గల్లంతవడం వల్ల కంపెనీపై అనేక నియంత్రణ ఉల్లంఘనలు నమోదయ్యాయని ఈడీ తెలిపింది. అసలు యజమాన్యం ఎవరో దాచేందుకు డమ్మీ డైరెక్టర్లను పెట్టి నిధుల మళ్లింపు జరిగిందన్న అనుమానాలున్నాయి. ఇప్పటికే అరెస్ట్ అయిన పార్థ సారథి బిస్వాల్‌ను కోర్టు ముందు హాజరుపరిచిన ఈడీ, ఆగస్టు 6 వరకు తమ కస్టడీలో విచారణకు అనుమతినీ పొందింది. అదే సమయంలో అనిల్ అంబానీకి కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి అంబానీని ఆగస్టు 5న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.