LOADING...
Al Falah University: అల్-ఫలాహ్ యూనివర్సిటీపై ఈడీ దాడులు.. 
అల్-ఫలాహ్ యూనివర్సిటీపై ఈడీ దాడులు..

Al Falah University: అల్-ఫలాహ్ యూనివర్సిటీపై ఈడీ దాడులు.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 18, 2025
10:06 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ బాంబు పేలుడు కేసును వేగంగా ముందుకు తీసుకెళ్తున్న NIA అధికారులు,ఈ ఘటన వెనుక జైషేకు చెందిన ఉగ్ర మాడ్యూల్ ఉన్నట్టు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే కొన్ని కీలక ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, జామియానగర్‌లో ఉన్న అల్-ఫలాహ్ యూనివర్సిటీపై ఈడీ తాజాగా దాడులు ప్రారంభించింది. యూనివర్సిటీకి అందుతోన్ననిధుల ప్రవాహం, వాటి వినియోగం, ఎక్కడికి మళ్లుతున్నాయన్న అంశాలపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈడీ దర్యాప్తు జరుపుతోంది.

వివరాలు 

కారు బాంబు పేలుడులో  15 మంది మృతి 

వర్సిటీ నిధులు ఉగ్ర కార్యక్రమాలకు దారి మళ్లించబడుతున్నాయా అనే కోణంలో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రధాన కార్యాలయం సహా మొత్తం 24 ప్రాంతాలలో ఈడీ శోధనలు కొనసాగుతున్నాయి. మరోవైపు, ఢిల్లీలోని చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ సమీపంలో ఇటీవల చోటుచేసుకున్న కారు బాంబు పేలుడులో ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు సోమవారం వెల్లడించారు.