తదుపరి వార్తా కథనం

Arvind Kejriwal: ఈడీ విచారణకు ఏడోసారి అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరు
వ్రాసిన వారు
Stalin
Feb 26, 2024
10:22 am
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ ఎక్సైజ్ పాలసీ వ్యవహారంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 7వ సారి జారీ సమన్లను కూడా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాటవేశారు.
సీఎం కేజ్రీవాల్ సోమవారం ఈడీ విచారణకు హాజరు కావడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని వెల్లడించింది.
చట్టపరమైన ప్రక్రియను గౌరవించాలని, కేజ్రీవాల్‌కు పదేపదే సమన్లు జారీ చేసే బదులు కోర్టు నిర్ణయం వచ్చే వరకు వేచి ఉండాలని ఆప్ కోరింది.
ముఖ్యమంత్రికి పలుమార్లు సమన్లు అందజేయడం సరికాదని వివరించింది.
ఈ కేసు విషయంలో నోటీసులను కేజ్రీవాల్ దాటవేస్తుండటంతో ఈడీ అధికారులు ఈ నెల ప్రారంభంలో దిల్లీ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ పిటిషన్ విచారణ దశలో ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కోర్టు నిర్ణయం వరకు వేచి ఉండాలని ఈడీకి ఆప్ హితవు
#ArvindKejriwal pic.twitter.com/xOMQWqoONn
— NDTV (@ndtv) February 26, 2024