Page Loader
ED Raids: చెన్నైలోని 10 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు..
చెన్నైలోని 10 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు..

ED Raids: చెన్నైలోని 10 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు..

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 07, 2025
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్, పరిపాలనా శాఖ మంత్రిగా ఉన్న కేఎన్ నెహ్రూ, ఆయన కుమారుడు, ఎంపీ అయిన అరుణ్ నెహ్రూ నివాసాలు సహా చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అడయార్‌, తేనాంపేట, సీఐటీ కాలనీ, ఎంఆర్‌సి నగర్‌ వంటి ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నెహ్రూ కుటుంబానికి మద్దతుగా ఉన్న అనేకమంది వారి ఇళ్లవద్దకు గుమికూడారు.

వివరాలు 

 "ట్రూ వాల్యూ హోమ్స్" లో ఆర్థిక అవకతవకలు

ఏప్రిల్ 7న తెల్లవారుజామునే ఈడీ బృందం మంత్రికి సంబంధించిన నివాసాలకు చేరుకొని తనిఖీలు ప్రారంభించింది. కేఎన్ నెహ్రూ సోదరుడు ఎన్. రవిచంద్రన్‌కు చెందిన "ట్రూ వాల్యూ హోమ్స్" అనే రియల్ ఎస్టేట్ సంస్థలో ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఆ వివరాలను నిర్ధారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రంగంలోకి దిగారు. "టీవీహెచ్" అనే పేరుతో 1997లో స్థాపించబడిన ఈ సంస్థ, తమిళనాడులో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీగా గుర్తింపు పొందింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మంత్రి కేఎన్ నెహ్రూ సోదరుడు రవిచంద్రన్ నిర్మాణ సంస్థలో రైడ్స్..