
Jharkhand CM: హేమంత్ సోరెన్ అరెస్టు.. జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్
ఈ వార్తాకథనం ఏంటి
భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ (Jharkhand) ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(Hemant Soren)ను ఈడీ అరెస్టు చేసింది. దీంతో ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు.
ఈ క్రమంలో జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్ నియామకమయ్యారు. ఈ మేరకు ఆయన కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
చంపయ్‌కు మద్దతుగా మద్దతు ఇస్తున్నట్లు అధికార మహాకూటమి నేతలు గవర్నర్‌కు లేఖలను సమర్పించారు.
కొత్త సీఎంగా హేమంత్ భార్య కల్పన అవుతారని తొలుత వార్తలు వచ్చాయి.
అయితే తోటి కోడలు అడ్డుపుల్ల వేయడంతో చంపయ్ సోరెన్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కల్పన ఎమ్మెల్యే కాదు. అందుకే ఆమెను సీఎం చేయలేదనే మరో వాదన వినిపిస్తోంది.
హేమంత్
చంపయ్ సోరెన్ ఎవరు?
చంపయ్ సోరెన్ ఒక రైతు నాయకుడు. హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో ఆయన సీనియర్ మంత్రిగా ఉన్నారు.
జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. అతన్ని 'జార్ఖండ్ టైగర్' అని కూడా అంటారు.
చంపయ్ సోరెన్ స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొందడం ద్వారా తన ఎన్నికల ప్రస్తానాన్ని ప్రారంభించారు.
చంపయ్ సోరెన్ గతంలో అర్జున్ ముండా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం హేమంత్ ప్రభుత్వంలో రవాణా, షెడ్యూల్డ్ తెగ, షెడ్యూల్డ్ కులాలు మరియు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు.
హేమంత్
హేమంత్ సోరెన్‌ను ఈడీ ఎందుకు అరెస్ట్ చేసింది?
రాంచీలో భారత ఆర్మీ భూములను అక్రమంగా విక్రయించినందుకు హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
5 ఎకరాల ఆర్మీ భూమిని నకిలీ పత్రాల ద్వారా విక్రయించారని, ఇందులో అధికారుల అండదండలు ఉన్నాయని ఈ కేసులో ఈడీ అభియోగాలు మోపింది.
ఈ కేసులో హేమంత్ ప్రమేయం ఉందని కొందరు అధికారులు కూడా చెప్పారని, విచారణలో హేమంత్‌ను దీనిపై ప్రశ్నలు అడగగా.. అతను సమాధానం చెప్పలేకపోయారని ఈడీ చెబుతోంది.
81మంది సభ్యులున్న జార్ఖండ్‌లో ప్రస్తుతం అధికార మహా కూటమికి 46మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
వీరిలో 29 మంది ఎమ్మెల్యేలు జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), 16మంది కాంగ్రెస్, ఒకరు రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నుంచి ఉన్నారు. జేఎంఎం ఎమ్మెల్యే ఒకరు ఇటీవల రాజీనామా చేశారు.