George Soros: జార్జ్ సోరస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ లబ్ధిదారుల సంస్థల్లో ఈడీ సోదాలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ సోరోస్ (George Soros) నిర్వహించే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ (OSF) లబ్ధిదారుల సంస్థల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు.
విదేశీ మారక నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో, బెంగళూరులో ఈ సోదాలు జరుగుతున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను స్వీకరిస్తోందని, అయితే ఈ నిధులను కొందరు లబ్ధిదారులు ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA) మార్గదర్శకాలను ఉల్లంఘించి ఉపయోగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో, ఈడీ అధికారులు సంబంధిత లబ్ధిదారుల సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అయితే, ఈ తనిఖీలపై ఇప్పటివరకు ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
వివరాలు
ప్రపంచంలోని ప్రముఖ కుబేరుల్లో జార్జ్ సోరోస్
హంగేరియన్-అమెరికన్ వ్యాపారవేత్త, వితరణశీలి జార్జ్ సోరోస్ (వయస్సు 92) ప్రపంచంలోని ప్రముఖ కుబేరుల్లో ఒకరు.
ఆయన స్థాపించిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ మానవ హక్కుల పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది.
భారతదేశంలో ఈ సంస్థ 1999 నుండి తన కార్యలాపాలు కొనసాగిస్తోంది.