Page Loader
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు 9వ సారి సమన్లు జారీ చేసిన ఈడీ

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు 9వ సారి సమన్లు జారీ చేసిన ఈడీ

వ్రాసిన వారు Stalin
Mar 17, 2024
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ మద్యం పాలసీలో అవినీతిపై విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరవింద్ కేజ్రీవాల్‌కు తొమ్మిదో సమన్లు ​​పంపింది. మార్చి 21న కేజ్రీవాల్‌ను విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటి వరకు కేజ్రీవాల్‌కు ఈడీ 8 సమన్లు ​​పంపింది. కానీ ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. దీనిపై ఈడీ కోర్టును ఆశ్రయించగా, కేజ్రీవాల్‌కు శుక్రవారం బెయిల్ లభించింది. 2023 ఫిబ్రవరిలో కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో, ప్రధాన నిందితులలో ఒకరైన సమీర్ మహేంద్రుతో కేజ్రీవాల్ వీడియో కాల్‌లో మాట్లాడారని ఈడీ పేర్కొంది. ఆ వీడియో కాల్‌లో నిందితుడు విజయ్‌ నాయర్‌ని తన స్నేహితుడిగా చెప్పి.. అతడిని నమ్మాలని కేజ్రీవాల్ చెప్పినట్లు ఈడీ అభియోగాలు మోపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మార్చి 21న విచారణకు పిలిచిన ఈడీ