Page Loader
Arvind Kejriwal: 8వ సారి అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు పంపిన ఈడీ 
Arvind Kejriwal: 8వ సారి అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు పంపిన ఈడీ

Arvind Kejriwal: 8వ సారి అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు పంపిన ఈడీ 

వ్రాసిన వారు Stalin
Feb 27, 2024
02:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ జాతీయ సమన్వయకర్త, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది. తాజా సమన్లతో అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ ఇప్పటి వరకు ఎనిమిది సార్లు నోటీసులు జారీ చేసింది. మార్చి 4న విచారణకు రావాలని ఈడీ పేర్కొంది. ఇది వరకు ఈడీ ఏడు సార్లు సమన్లు జారీ చేయగా.. కేజ్రీవాల్ ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున కేజ్రీవాల్ విచారణకు హాజరు కాబోరని ఆప్ పేర్కొంది. కోర్టు తీర్పు ఇచ్చే వరకు మరోసారి కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేయొద్దని ఈ నెల 26న ఆప్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మార్చి 4న విచారణకు పిలిచిన ఈడీ