Delhi liquor case: దిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు నాలుగోసారి ఈడీ సమన్లు
Delhi liquor policy case: దిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. దిల్లీ లిక్కర్ స్కామ్‌లో విచారణకు హాజరుకావాలని ఈడీ ఇప్పటికే కేజ్రీవాల్‌కు మూడుసార్లు సమన్లు పంపగా.. తాజాగా నాలుగోసారి కావడం గమనార్హం. జనవరి 18న విచారణకు హాజరుకావాల్సిందిగా.. అరవింద్ కేజ్రీవాల్‌ను నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఈడీ పంపిన సమన్లపై అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. వాటిని చట్టవిరుద్ధమైనవిగా అభివర్ణించారు. 'రాజకీయ ప్రేరేపితమైనది'గా పేర్కొన్నారు. తన జీవితాన్ని నిజాయితీగా, పారదర్శకంగా గడిపానని, తాను దాచడానికి ఏమీ లేదని చెప్పారు. తనను అరెస్టు చేయడమే ఏకైక ఎజెండాగా ఈడీ సమన్లు జారీ చేస్తోందని వెల్లడించారు.