LOADING...
Mahadev App Case: మహాదేవ్ యాప్ కేసులో భూపేష్ బఘేల్‌కు భారీ ఊరట 
Mahadev App Case: మహాదేవ్ యాప్ కేసులో భూపేష్ బఘేల్‌కు భారీ ఊరట.. వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్న నిందితుడు

Mahadev App Case: మహాదేవ్ యాప్ కేసులో భూపేష్ బఘేల్‌కు భారీ ఊరట 

వ్రాసిన వారు Stalin
Nov 25, 2023
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో నిందితుడైన కొరియర్ అసిమ్ దాస్‌ తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్నాడు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్‌కు రూ.508 కోట్ల నగదు చెల్లింపు చేశారనే ఆరోపణలపై హరాసల్ మహాదేవ్ బెట్టింగ్ యాప్ కోసం పనిచేస్తున్న కొరియర్ అసిమ్ దాస్‌ను నవంబర్ 3న రాయ్‌పూర్‌లో అరెస్టు చేశారు. తాజాగా తాను ఏ నాయకుడికి ఎప్పుడూ డబ్బు డెలివరీ చేయలేదని, తనను కావాలనే ఇంప్లీడ్ చేస్తున్నట్లు ప్రత్యేక కోర్టుకు కొరియర్ తెలిపారు. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది.

కేసు

అసెంబ్లీ ఎన్నికల వేళ సంచలనంగా మారిన ఈ కేసు

మహాదేవ్ బెట్టింగ్ స్కామ్‌కు సంబంధించి అరెస్టయిన ఆరోపించిన కొరియర్ అసీమ్ దాస్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు రూ. 508 కోట్ల నగదును ఇచ్చినట్లు మొదట ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల వేళ, ఇది జరగడంతో ఈ కేసుకు మరింత ప్రాధాన్యత సంచరించుకుంది. చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశకు నాలుగు రోజుల ముందు అంటే నవంబర్ 3న మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు ఆరోపణలతో అసిమ్ దాస్, పోలీసు కానిస్టేబుల్ భీమ్ సింగ్ యాదవ్‌ను ఈడీ అరెస్టు చేసింది. రాష్ట్రంలో నవంబర్ 7, 17 తేదీల్లో అసెంబ్లీకి పోలింగ్ జరిగింది. పోలింగ్ తర్వాత భఘోల్‌కు ఊరట లభించడం గమనార్హం.