NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్ ఆస్తులను జప్తు చేసిన ఈడీ
    తదుపరి వార్తా కథనం
    Delhi: హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్ ఆస్తులను జప్తు చేసిన ఈడీ
    Delhi: హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

    Delhi: హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 10, 2023
    01:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం,2002లోని నిబంధనల ప్రకారం న్యూదిల్లీలోని CMD, హీరో మోటోకార్ప్ ఛైర్మన్ పవన్ ముంజాల్ ₹24.95 కోట్ల విలువైన మూడు ఆస్తులను అటాచ్ చేసింది.

    ముంజాల్,ఇతరులపై అక్రమంగా భారతదేశం నుండి విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకున్నందుకు కస్టమ్స్ చట్టం, 1962లోని సెక్షన్ 135 కింద డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ ఫిర్యాదు ఆధారంగా ED దర్యాప్తు ప్రారంభించిందని దర్యాప్తు సంస్థ తెలిపింది.

    ప్రాసిక్యూషన్ ఫిర్యాదులో విదేశీ కరెన్సీ/విదేశీ మారకానికి సమానమైన రూ. 54 కోట్లను అక్రమంగా భారత్ నుంచి తరలించారని పేర్కొంది.

    Details 

    జప్తు, అటాచ్‌మెంట్ మొత్తం విలువ సుమారు ₹50 కోట్లు

    ముంజాల్ ఇతర వ్యక్తుల పేరిట విదేశీ మారకద్రవ్యం/విదేశీ కరెన్సీని జారీ చేసి, ఆ తర్వాత విదేశాల్లో తన వ్యక్తిగత ఖర్చులకు వినియోగించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని ED తెలిపింది.

    పవన్ ముంజాల్ ప్రాంగణంలో ఈడీ 'సెర్చ్ ఆపరేషన్స్' నిర్వహించింది ఆగస్ట్ 1న, ముంజాల్,అతని కంపెనీకి చెందిన ఇతర అధికారుల ప్రాంగణంలో ED సోదాలు నిర్వహించింది.

    డిజిటల్ ఆధారాలు, ఇతర నేరారోపణ ఆధారాలతో పాటు ₹25 కోట్ల (సుమారు) విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుంది. జప్తు, అటాచ్‌మెంట్ మొత్తం విలువ సుమారు ₹50 కోట్లు ఉంటుందని ఏజెన్సీ తెలిపింది.

    మార్చి 2022లో, పన్ను ఎగవేత ఆరోపణలపై హీరో మోటార్‌కార్ప్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. ముంజాల్ నివాసంలో కూడా డిపార్ట్‌మెంట్ సోదాలు నిర్వహించింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    పవన్ ముంజాల్ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

    ED Attaches Properties Worth ₹24.95 Crore Of Hero MotoCorp Chairman Pawan Munjalhttps://t.co/2pBwmHMpBt

    — TIMES NOW (@TimesNow) November 10, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    తాజా

    Virender Sehwag: పాక్‌కు మర్చిపోలేని సమాధానం అందుతుంది.. భారత సైన్యానికి సెహ్వాగ్ మద్దతు వీరేంద్ర సెహ్వాగ్
    Vikram Misri: పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయంపై ఐఎంఎఫ్‌లో తన వాదన వినిపించనున్న భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    Pakistan: భారతదేశంతో ఉద్రిక్తతల మధ్య.. ఆర్థిక సహాయం కోసం పంచ బ్యాంకు'ను సంప్రదించిన పాకిస్తాన్  పాకిస్థాన్
    Omar Abdullah: అత్యవసరంగా జమ్మూకు ఒమర్‌ అబ్దుల్లా.. పరిస్థితిని సమీక్షించనున్న సీఎం  ఒమర్ అబ్దుల్లా

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    దిల్లీ మద్యం కేసు: కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం పాలసీ కేసు: కవిత పిటిషన్‌పై విచారణ మూడు వారాలకు వాయిదా కల్వకుంట్ల కవిత
    డేటా చోరీ కేసు: మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రంగంలోకి దిగిన ఈడీ హైదరాబాద్
    హైదరాబాద్‌లో ఈడీ సోదాల కలకలం; ఆ కంపెనీలే టార్గెట్‌గా దాడులు హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025