Jaypee Infratech Md Manoj Gaur: రూ.12 వేల కోట్ల మనీలాండరింగ్ కేసు.. జేపీ ఇన్‌ఫ్రాటెక్ ఎండీ మనోజ్ గౌర్ అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
జేపీ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గౌర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేసింది. గృహ కొనుగోలుదారులను మోసం చేసి, వారి పెట్టుబడి డబ్బును ఇతరత్రా మళ్లించిన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ఒక ఆంగ్ల పత్రిక వెల్లడించింది. ఈ కేసు 2002లో అమల్లోకి వచ్చిన మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద నమోదు చేసినట్లు సమాచారం.
వివరాలు
దిల్లీ, ముంబయి, ఘజియాబాద్ ప్రదేశాల్లో సోదాలు
గత మే నెలలో ఈడీ అధికారులు జేపీ ఇన్‌ఫ్రాటెక్, జేపీ అసోసియేట్స్,వాటి అనుబంధ సంస్థలపై విస్తృత సోదాలు నిర్వహించారు. దిల్లీ, ముంబయి, ఘజియాబాద్ ప్రాంతాల్లోని 15 ప్రదేశాల్లో ఈ సోదాలు జరిగాయి. ఈ దాడుల సమయంలో రూ.1.7 కోట్ల నగదు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, డిజిటల్ డేటా, అలాగే ప్రమోటర్లు, వారి కుటుంబ సభ్యులు, గ్రూప్ కంపెనీల పేర్లపై నమోదైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.