Page Loader
Mahadev betting app case: దుబాయ్‌లో పట్టుబడిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ యజమాని 
Mahadev betting app case: దుబాయ్‌లో పట్టుబడిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ యజమాని

Mahadev betting app case: దుబాయ్‌లో పట్టుబడిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ యజమాని 

వ్రాసిన వారు Stalin
Dec 13, 2023
10:49 am

ఈ వార్తాకథనం ఏంటి

Mahadev betting app case: మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో నిందితుల్లో ఒకరు, దాని యజమాని రవి ఉప్పల్‌ను దుబాయ్ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లో స్థానిక అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్‌పోల్ ద్వారా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా ఉప్పల్‌ను అరెస్టు చేశారు. ఉప్పల్‌ను గతవారమే ఇంటర్ పోల్ అదికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు దుబాయ్ అధికారులతో తాము టచ్‌లో ఉన్నట్లు ఈడీ తెలిపింది. మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ యాప్ కేంద్ర ప్రధాన కార్యాలయం యూఏఈలో ఉన్నట్లు ఈడీ వెల్లడించింది.

ఉప్పల్

రవి ఉప్పల్‌కు 'వనాటు' దేశం పాస్‌పోర్టు

అక్రమ బెట్టింగ్‌కు సంబంధించిన కేసులో అక్టోబర్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ యజమాని ఉప్పల్‌తో పాటు మరో ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్‌పై ప్రత్యేక కోర్టులో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇదిలా ఉంటే.. రవి ఉప్పల్‌కు పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీప దేశమైన 'వనాటు' పాస్‌పోర్టు ఉన్నట్లు చార్జ్ షీట్‌లో ఈడీ కోర్టుకు తెలిపింది. అతను భారత పౌరసత్వాన్ని వదులుకోకుండానే, ఆ దేశ పౌరసత్వం తీసుకున్నారని ఈడీ ఆరోపించింది. అలాగే ఉప్పల్ సంపాదన నేరపూరితమైనదని అభియోగాలు మోపింది.