
ED: బెట్టింగ్ యాప్ కేసు.. విజయ్ దేవరకొండ, రానా, ఇతర సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు
ఈ వార్తాకథనం ఏంటి
బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దూకుడు పెంచారు. విచారణను మరింత వేగవంతం చేశారు. తాజాగా సినీ నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మిలకు నోటీసులు జారీ చేశారు. నోటీసుల ప్రకారం, జూలై 23న రాణా దగ్గుబాటి, జూలై 30న ప్రకాశ్ రాజ్, ఆగష్టు 6న విజయ్ దేవరకొండ, ఆగష్టు 13న మంచు లక్ష్మిలు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. వీరితో పాటు ప్రముఖ టెక్నాలజీ సంస్థలైన మెటా, గూగుల్ సంస్థలకు కూడా ఈడీ నోటీసులు పంపింది. ఈ సంస్థల ప్రతినిధులు జూలై 28న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
వివరాలు
బెట్టింగ్ యాప్‌లతో మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు
ఈ కేసులో బెట్టింగ్ యాప్‌ల ద్వారా మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు జరుగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈడీ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఇదిలావుండగా, గూగుల్, మెటా వంటి సంస్థలు ఇలాంటి యాప్‌లకు తమ వేదికలపై విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నట్లు ఈడీ ఆరోపించింది. ఈ టెక్ సంస్థలు కేవలం ప్రకటనల కోసం స్లాట్లు కేటాయించడమే కాదు, సంబంధిత వెబ్‌సైట్‌లకు లింక్‌లు కూడా అందుబాటులో ఉంచుతున్నాయని స్పష్టం చేసింది.