Neville Singham : అమెరికన్ మిలియనీర్ నెవిల్లే సింఘమ్‌కు షాక్.. సమన్లు జారీ చేసిన ఈడీ
న్యూస్‌క్లిక్ టెర్రేర్ కేసుకు సంబంధించి అమెరికా (యుఎస్)కి చెందిన అపర కుబేరుడు నెవిల్లే రాయ్ సింఘమ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపించింది. ప్రస్తుతం చైనాలోని షాంఘైయిలో ఉన్న నెవిల్లే రాయ్ సింఘమ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) ద్వారా సమన్లు పంపించినట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే భారతదేశం, సహా ఇతర దేశాల్లో చైనాకు అనుకూలంగా ప్రచారం చేయడంపై తొలిసారిగా సింఘమ్ ప్రమేయం ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనంలో ప్రస్తావించారు.
న్యూస్‌క్లిక్ చైనా దేశానికి చేస్తున్న ప్రచారాన్ని గుర్తించిన దిల్లీ స్పెషల్ పోలీస్
న్యూస్‌క్లిక్ చైనా దేశానికి చేస్తున్న ప్రచారాన్ని గుర్తించామని దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ పేర్కొంది. ఈ కేసులో సింఘమ్‌ను నిందితుడిగా గుర్తించింది. న్యూస్‌క్లిక్ ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థ, హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిలను చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద అక్టోబర్ 3న అరెస్ట్ అయ్యారు. అదనంగా, గత నెలలో జరిగిన దాడుల్లో జర్నలిస్టులు, కార్యకర్తలతో సహా దాదాపు 100 మంది వ్యక్తులు ఈడీ నిఘాలో ఉన్నారు. న్యూస్‌క్లిక్ కేసులో నిందితుడిగా ఉన్న సింఘమ్ , చైనా ప్రభుత్వ ప్రచార విభాగానికి అనుసంధానించబడిన ఫండింగ్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నట్లు గతంలో పెద్ద ఎత్తువ ఆరోపణలు వెల్లువెత్తాయి.