Hemant Soren: భూ కుంభకోణం కేసు.. జార్ఖండ్ సీఎం సోరెన్‌కు ఈడీ మరోసారి సమన్లు
భూ కుంభకోణం కేసుకు సంబంధించి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సోమవారం ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద మంగళవారం విచారణకు హాజరవ్వాలని సీఎం సోరెన్‌ను ఈడీ కోరింది. గతంలో ఈడీ మనీలాండరింగ్ కేసులో తనపై జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ సోరెన్ జార్ఖండ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. భూ కుంభకోణం కేసుకు సంబంధించి సోరెన్‌కు ఆగస్టు మధ్యలో ఈడీ సమన్లు పంపింది. అయితే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో బిజీగా ఉన్నానంటూ సమన్లు పంపినా సీఎం పట్టించుకోలేదు. ఆ తర్వాత మరో నాలుగు సార్లు ఈడీ సమన్లు పంపినా.. సోరెన్ దాటవేసారు. మరి ఇప్పుడైనా సోరెన్ హాజరవుతారా? అనేది చూడాలి.