LOADING...
Rajasthan: పేపర్ లీక్ కేసులో రాజస్థాన్ పీసీసీ చీఫ్ కుమారులకు సమన్లు
Rajasthan : పేపర్ లీక్ కేసులో రాజస్థాన్ పీసీసీ చీఫ్ కుమారుడికి సమన్లు

Rajasthan: పేపర్ లీక్ కేసులో రాజస్థాన్ పీసీసీ చీఫ్ కుమారులకు సమన్లు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 02, 2023
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్ కాంగ్రెస్ నేతలు పేపర్ లీక్ కేసులను ఎదుర్కోంటున్నారు. ఈ మేరకు తాజాగా ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా కుమారులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. గతేడాది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి పరీక్షా పత్రాల లీకేజీలో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. గత వారమే రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు ​​అందజేసింది. అక్టోబర్ 30న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్‌పై విదేశీ మారకద్రవ్య నిబంధనలు (ఫెమా రెగ్యూలేషన్స్) ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఈడీ దాదాపు 9 గంటల పాటు సోదాలు చేపట్టింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజస్థాన్ పీసీసీ కుమారులకు ఈడీ సమన్లు జారీ