Al Falah Group: ఈడీ కస్టడీలో అల్ ఫలాహ గ్రూపు చైర్మెన్.. 13 రోజుల కస్టడీ
ఈ వార్తాకథనం ఏంటి
అల్ ఫలాహ్ గ్రూప్ (Al Falah Group) చైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిక్‌ను మంగళవారం ఈడీ అరెస్ట్ చేసింది. అల్ ఫలాహ్ చారిటబుల్ ట్రస్ట్‌కు చెందిన మనీల్యాండరింగ్ కేసు దర్యాప్తు నేపథ్యంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం,సిటీ కోర్టు డిసెంబర్ 1 వరకు.. మొత్తం 13రోజులపాటు.. సిద్ధిక్‌ను ఈడీ కస్టడీలో ఉంచాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. బుధవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో అడిషనల్ సెషన్స్ జడ్జి షీతల్ చౌదరి ప్రథాన్ ప్రత్యేక సూచనలు ఇచ్చారు. ఎంపీఎల్ఏ చట్టంలోని సెక్షన్ 19ప్రకారం సిద్ధిక్ అరెస్టు నమోదు కాగా,రిమాండ్ కోసం అతడిని అదే రాత్రి కోర్టుకు తీసుకెళ్లారు. అల్ ఫలాహ్ గ్రూప్‌పై సాగించిన విచారణ అనంతరం ఈడీ ఈ చర్యలకు దిగినట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
ఢిల్లీ క్రైం బ్రాంచ్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ దర్యాప్తు
ఢిల్లీ క్రైం బ్రాంచ్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ కాలేజీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తప్పుదారి పట్టించిందని గుర్తించారు. కాలేజీకి ఎన్ఏఏసీ గుర్తింపు ఉందని అబద్ధ ప్రచారం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అలాగే, 1956 యూజీసీ చట్టంలోని సెక్షన్ 12(బీ) కింద అనుమతి ఉన్నట్టు చూపించడంలోనూ అవకతవకలు జరిగాయని విచారణలో వెలుగుచూసింది.