కవితను కోర్టులో హాజరుపర్చిన ఈడీ ఆధికారులు
దిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శనివారం ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. అంతకుముందు కవితకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అనంతరం జస్టిస్ కేఎం నాగపాల్ ఎదుట హాజరుపర్చారు. కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కవితను అరెస్టు చేసిన తర్వాత అర్ధరాత్రి దిల్లీకి తరలించారు. ఈడీ కేంద్ర కార్యాలయంలో కవితకు ప్రత్యేక సెల్‌ను కేటాయించారు. కవితను ఈడీ అధికారులు 10రోజుల కస్టడీని కోరుతున్నారు. ఈ కేసులో తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కవిత వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఈ క్రమంలో ఆమెను అరెస్టు చేయడాన్ని కవిత తరఫున లాయర్ 'చట్టవిరుద్ధం'గా పేర్కొన్నారు.