ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్: లాలూ, రబ్రీ దేవి, మిసా భారతికి రూ.50వేల పూచీకత్తుపై బెయిల్
ఈ వార్తాకథనం ఏంటి
ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతికి దిల్లీ రూస్ అవెన్యూ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 29న జరగనుంది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేయకుండానే చార్జిషీట్ దాఖలు చేసిందని, నిందితులందరికీ రూ. 50,000 వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.
లాలూ యాదవ్ వీల్ చైర్‌లో రోస్ అవెన్యూ కోర్టుకు వస్తున్నట్లు కనిపించారు. లాలూ మూడు నెలల క్రితం సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు.
బిహార్
భార్య అనారోగ్యంతో కోర్టుకు హాజరుకాని తేజస్వి యాదవ్
ఉద్యోగాల కుంభకోణం కేసులో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీదేవి, ఆర్‌జేడీ ఎంపీ మిసా భారతి 15వ తేదీన కోర్టు హాజరు కావాలని ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి ఫిబ్రవరి 27న సమన్లు జారీ చేశారు. లాలూ, రబ్రీదేవి, భారతి కోర్టుకు హాజరయ్యారు.
ఈ కేసులో లాలూ కుటుంబానికి చెందిన పలువురిని సీబీఐ ఒకవైపు ప్రశ్నిస్తుండగా, మరోవైపు ఇదే కేసులో ఈడీ సోదాలు నిర్వహించడం గమనార్హం.
దిల్లీలోని బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌తో పాటు లాలూ బంధువులు, అనుచరుల ఇళ్లలో ఈడీ బృందాలు మార్చి 10న తనిఖీలు చేశాయి.
ఈ కేసులో తేజస్వికి సీబీఐ సమన్లు పంపింది. అయితే తన భార్య అనారోగ్య కారణాల వల్ల తేజస్వి కోర్టు ముందు హాజరుకాలేకపోయారు.