ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు మరోసారి సమన్లు జారీ చేసిన సీబీఐ
ఈ వార్తాకథనం ఏంటి
ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసులో బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ను విచారించేందుకు గురువారం సీబీఐ మరోసారి సమన్లను జారీ చేసింది.
తేజస్వి యాదవ్‌కు ఇప్పిటకే సీబీఐ మూడు సార్లు సమన్లు జారీ చేయడంగా, పలు కారణాలతో ఆయన విచారణకు హాజరు కాలేదు. ఫిబ్రవరి 28, 2023, మార్చి 4, 2023, మార్చి 11, 2023న సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ మూడు సార్లు సీబీఐ ఎదుట తేజస్వి హాజరు కాలేదు.
అంతేకాదు సీబీఐ జారీ చేసిన మూడు సమన్లను రద్దు చేయాలని బుధవారం తేజస్వీ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
సీబీఐ
ఈ నెలలో తేజస్విని అరెస్టు చేయబోమని సీబీఐ హామీ
తేజస్వి యాదవ్ పిటిషన్‌ను గురువారం దిల్లీ హైకోర్టు విచారించింది. ఈ విచారణకు తేజస్వి కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో ఈ నెలలో తేజస్విని అరెస్టు చేయబోమని సీబీఐ కోర్టుకు హామీ ఇచ్చింది. దీంతో తేజస్వి విచారణకు హాజరవుతారని ధర్మనాసం వెల్లడించింది.
ఈ క్రమంలో ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని సీబీఐ నాలుగోసారి సమన్లను జారీ చేసింది.
ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతికి దిల్లీ రూస్ అవెన్యూ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 29న జరగనుంది.