NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మాజీ మంత్రి విజయరామారావు కన్నుమూత; సీఎం కేసీఆర్ సంతాపం
    మాజీ మంత్రి విజయరామారావు కన్నుమూత; సీఎం కేసీఆర్ సంతాపం
    భారతదేశం

    మాజీ మంత్రి విజయరామారావు కన్నుమూత; సీఎం కేసీఆర్ సంతాపం

    వ్రాసిన వారు Naveen Stalin
    March 14, 2023 | 09:22 am 0 నిమి చదవండి
    మాజీ మంత్రి విజయరామారావు కన్నుమూత; సీఎం కేసీఆర్ సంతాపం
    మాజీ మంత్రి విజయరామారావు కన్నుమూత

    సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి విజయరామారావు(84) కన్నుమూశారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో విజయరామారావు మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విజయరామారావు మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రభుత్వ అధికారిగా, ప్రజాప్రతినిధిగా విజయరామారావు చేసిన సేవలు అభినందనీయమని అన్నారు. విజయరామారావుతో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు.

    చంద్రబాబు ప్రభుత్వం మంత్రిగా పనిచేసిన విజయరామారావు

    విజయరామారావు స్వస్థలం వరంగల్ జిల్లా ఏటూరునాగారం. 1959 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. విజయరామారావు పూర్వ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఏఎస్పీగా తొలిసారి ఉద్యోగంలో చేరారు. హైదరాబాద్ పోలీస్ కమీషనర్‌తో పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. ఆ తర్వాత హవాలా కుంభకోణం, బాబ్రీ మసీదు కూల్చివేత, ముంబై పేలుళ్లు తదితర కేసుల్లో కీలక పాత్ర పోషించిన ఆయన సీబీఐ డైరెక్టర్‌గా పని చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత, విజయరామారావు తెలుగుదేశం పార్టీలో చేరి, 1999లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకుడు పి.జనార్దన్ రెడ్డిపై గెలుపొందారు. చంద్రబాబు ప్రభుత్వంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత టీడీపీకి రాజీనామా చేసి అందులో చేరారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తెలంగాణ
    తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    తెలంగాణ రాష్ట్ర సమితి/ టీఆర్ఎస్

    తెలంగాణ

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; 16వ తేదీన ఫలితాలు ఎమ్మెల్సీ
    తెలంగాణలోని 18జిల్లాల్లో వర్షాలు; ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ ఐఎండీ
    దిల్లీ లిక్కర్ కుంభకోణం: నేడు ఈడీ ఎదుట విచారణకు కవిత కల్వకుంట్ల కవిత
    సర్వేలన్నీ బీఆర్ఎస్‌కే అనుకూలం, డిసెంబర్‌లోనే తెలంగాణలో ఎన్నికలు: సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత ఆంధ్రప్రదేశ్
    జూనియర్ ఎన్టీఆర్- నారా లోకేశ్ మధ్య ఓటింగ్ పెట్టాలి: కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్
    అమరావతి భూముల కేసు: హైదరాబాద్‌లో మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇంట్లో సీఐడీ సోదాలు ఆంధ్రప్రదేశ్
    చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు నాయుడు

    తెలంగాణ రాష్ట్ర సమితి/ టీఆర్ఎస్

    ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సమన్లు జారీ చేసిన ఈడీ కల్వకుంట్ల కవిత
    తెలంగాణాలో రూ.21,400 కోట్ల పెట్టుబడులు : కేటీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో జరిగిన ఘోరం: సిలిండర్ పేలుడుతో భారీ ప్రమాదం  తెలంగాణ
    Telangana Formation Day 2023: తెలంగాణ పదేళ్ల సంబరం; ఉద్యమ చరిత్రను ఓసారి స్మరించుకుందాం  తెలంగాణ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023