Page Loader
బిహార్, ఒడిశాలో మరికొన్ని ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ 5జీ సేవలు ప్రారంభం
బిహార్, ఒడిశాలో మరికొన్ని ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ 5జీ సేవలు ప్రారంభం

బిహార్, ఒడిశాలో మరికొన్ని ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ 5జీ సేవలు ప్రారంభం

వ్రాసిన వారు Stalin
Feb 18, 2023
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్, ఒడిశాలోని బెగుసరాయ్, కిషన్‌గంజ్, పూర్నియా, గోపాల్‌గంజ్, సోనేపూర్, భవానీపట్నా, పరదీప్‌తో సహా మరిన్ని ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ తన 5జీ సేవలను ప్రారంభించింది. అర్హత కలిగిన ఎయిర్‌టెల్ వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండా 5జీ సేవలను పొందవచ్చు. కంపెనీ తన 5జీ డేటా ప్లాన్‌ను ఇంకా వెల్లడించలేదు. ఎయిర్‌టెల్ తన 5జీ నెట్‌వర్క్‌ను ఈ సంవత్సరం నాటికి భారతదేశంలోని ప్రధాన నగరాల్లో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి 2024 నాటికి దేశం మొత్తాన్ని కవర్ చేయాలని భావిస్తోంది. ఎయిర్‌టెల్ తన 5జీ రోల్‌అవుట్‌ను అక్టోబర్ 2022లో ప్రారంభించింది. ఇప్పటికే ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్‌కు మిలియన్ కంటే ఎక్కువ మంది కస్టమర్లను ఉన్నారు.

ఎయిర్‌టెల్

కిషన్‌గంజ్‌, పూర్నియా, గోపాల్‌గంజ్‌, బార్హ్‌లో అందుబాటులోకి 5జీ సేవలు

కిషన్‌గంజ్‌లోని నెట్‌వర్క్ డీ మార్కెట్, హలీమ్ చౌక్, ఖగ్రా, కాల్టెక్స్ చౌక్, పశ్చిమ్ పల్లిలో ఎయిర్‌టెల్ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పూర్నియాలో, ఇది భాతా బజార్, రాంబాగ్, మధుబని, రంగభూమి మైదాన్, గులాబ్ బాగ్‌లలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. గోపాల్‌గంజ్‌లోని బస్టాండ్, యాదవ్ పూర్ చౌక్, గోపాల్‌గంజ్ కచాహరి, హాస్పిటల్ చౌక్, జంగాలియా మొహల్లాలో 5జీ నెట్ వర్క్ పని చేస్తోంది. బార్హ్‌లోని స్టేషన్ రోడ్ బార్హ్, అత్మల్‌గోలా, బార్హ్ బజార్, ఆండాల్, పండరక్‌లలో సేవలు అందుబాటులోకి వచ్చాయి.