రాయ్‌పూర్, దుర్గ్-భిలాయ్‌లో 5G సేవలను ప్రారంభించిన ఎయిర్ టెల్
భారతీ ఎయిర్‌టెల్ తన 5G సేవలను ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, దుర్గ్-భిలాయ్. నగరాల్లో ప్రారంభించింది. రాయ్‌పూర్‌లో పంధ్రి, జవహర్ చౌక్, మోవా - సద్దు, గోల్ బజార్, శంకర్ నగర్ - అశోక్ రత్న, భన్‌పురి, ఉర్లా, రాజా తలాబ్, భర్తగావ్, RDA కాలనీ, వాల్ ఫోర్ట్ కాలనీ, సంతోషి నగర్, సమతా కాలనీ, గుడిహారిలో 5G అందుబాటులో ఉంది. దుర్గ్-బిలాయ్‌లో ఇస్పాత్ నగర్, TI మాల్, సెక్టార్ 7, సుభాష్ చౌక్, కోహ్కా చౌక్, తిరంగా చౌక్, ప్రియదర్శిని, ఖుర్షితార్, సర్దా పారా క్యాంప్ 2 మరియు రామ్‌నగర్ రోడ్‌లో 5G అందుబాటులో ఉంది. ఈ వారం ప్రారంభంలో ఎయిర్‌టెల్ మధ్యప్రదేశ్-ఉజ్జయిని, గ్వాలియర్, భోపాల్‌లోని మరో మూడు నగరాల్లో 5G సేవలను ప్రారంభించింది.
4G వేగం కంటే 20-30 రెట్లు ఎక్కువ వేగాన్ని 5G అందిస్తుంది
ఈ రెండు నగరాల్లోని ఎయిర్‌టెల్ కస్టమర్‌లు ఇప్పుడు అల్ట్రాఫాస్ట్ నెట్‌వర్క్‌ను పొందుతారు. ప్రస్తుత 4G వేగం కంటే 20-30 రెట్లు ఎక్కువ వేగాన్ని 5G అందిస్తుందని భారతీ ఎయిర్‌టెల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సిఈఓ సుజయ్ చక్రబర్తి అన్నారు. ఇప్పటికే ఉన్న 4G సిమ్ 5G సపోర్ట్ చేస్తుంది కాబట్టి కొత్త సిమ్ ని కొనాల్సిన అవసరం లేదు. ఎయిర్ టెల్ 5G ప్లస్ ఆక్టివేట్ చేయడానికి స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్‌లకు వెళ్ళి, మొబైల్ నెట్‌వర్క్‌ని ఎంచుకుని, ఎయిర్‌టెల్ సిమ్‌ని ఎంచుకోవాలి. ఇప్పుడు నెట్‌వర్క్ ఆప్షన్ ను ఎంచుకుని, 5G నెట్‌వర్క్ పై క్లిక్ చేయాలి.. ఎయిర్‌టెల్ ఈ సంవత్సరం చివరినాటికి భారతదేశంలోని ప్రధాన పట్టణాలలో ప్రారంభించి, మార్చి 2024కు దేశవ్యాప్తంగా 5Gను విస్తరించాలని భావిస్తోంది.