కేరళలో మరో మూడు నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు
భారతి ఎయిర్‌టెల్ తన 5G సేవలను కేరళలోని కోజికోడ్, త్రివేండ్రం, త్రిస్సూర్‌లో విడుదల నగరాల్లో ప్రారంభించింది. ఈ నగరాల్లో ఎయిర్‌టెల్ వినియోగదారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ప్రస్తుత 4G నెట్‌వర్క్ కంటే 20-30 రెట్లు వేగవంతమైన వేగంతో ఆనందించవచ్చు. ప్రస్తుతం ఎయిర్ టెల్ తన 5G డేటా ప్లాన్‌లను ఇంకా వెల్లడించలేదు. ఎయిర్‌టెల్ ఈ సంవత్సరం నాటికి భారతదేశంలోని ప్రధాన పట్టణాలన్నిటిలో 5G సేవలను విస్తరించాలని భావిస్తోంది. మార్చి 2024 నాటికి దేశవ్యాప్తంగా 5Gను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. ఇప్పటికే ఎయిర్ టెల్ 5G నెట్‌వర్క్ ను మిలియన్ కంటే ఎక్కువ మంది వినియోగదారులు వాడుతున్నారు. ఎయిర్‌టెల్ తో పాటు రిలయన్స్ జియో 5G సేవలను అక్టోబర్ 2022లో ప్రారంభించాయి.
గత నెలలో ఎయిర్ టెల్ 5G సేవలు కొచ్చిలో ప్రారంభమయ్యాయి
ఎయిర్ టెల్5G Plus కోజికోడ్‌లో నడకవే, పాళయం, కల్లాయి, వెస్ట్ హిల్, కుట్టిచిర, ఎరన్హిపాళం, మీంచంద, తొండయాడ్, మలపరమబా, ఎలత్తూర్, కున్నమంగళంలో, త్రివేండ్రంలో, వజుతక్కడ్, తంపనూర్, ఈస్ట్ ఫోర్ట్, పాళయం, పట్టం, కజకూట్టం, వట్టియూర్కావు, పప్పనంకోడ్, కోవలం, విజింజం, వలియవిలాలలో, త్రిస్సూర్‌లో రామవర్మపురం, త్రిసూర్ రౌండ్, ఈస్ట్ ఫోర్ట్, కూర్కెంచెరి, ఒలరికారా, ఒల్లూరు, మన్నుతి, నడతారలో అందుబాటులో ఉంది. గత నెలలో, ఎయిర్ టెల్ తన 5G సేవలను కొచ్చిలో కూడా ప్రారంభించింది. 5G సేవల కోసం 4G SIM సరిపోతుంది కొత్తది కొనాల్సిన అవసరంలేదు. స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్‌లకు వెళ్లి మొబైల్ నెట్‌వర్క్‌ని ఎంచుకుని, ఎయిర్‌టెల్ సిమ్‌ని ఎంచుకుని ప్రాధాన్య నెట్‌వర్క్ ను ఎంచుకుని, 5G నెట్‌వర్క్ పై క్లిక్ చేయాలి.