Page Loader
అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు
ఈశాన్య రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు

అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 16, 2023
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతి ఎయిర్‌టెల్ తన 5G సేవలను భారతదేశంలోని కోహిమా, ఐజ్వాల్, గ్యాంగ్‌టాక్, టిన్సుకితో సహా మరిన్ని ఈశాన్య నగరాల్లో ప్రారంభించింది. మార్చి 2024 నాటికి దేశవ్యాప్తంగా 5G రోల్‌అవుట్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంస్థ నాన్-స్టాండలోన్ 5G టెక్నాలజీని, 4G నెట్‌వర్క్ భాగాలను ఉపయోగిస్తుంది. ఎయిర్‌టెల్ కోహిమా, ఇటానగర్, ఐజ్వాల్, గాంగ్‌టక్, సిల్చార్, దిబ్రూగర్, టిన్సుకియా నగరాలతో 5G సేవలను మొత్తం ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించింది. ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్ ఇప్పటికే గౌహతి, ఇంఫాల్, షిల్లాంగ్, అగర్తల, దిమాపూర్‌లలో అందుబాటులో ఉంది. ఇటీవల, టెలికాం సంస్థ తన 5G సేవలను సూరత్, వడోదర, రాజ్‌కోట్, సంబల్‌పూర్, బాలాసోర్‌తో సహా గుజరాత్ మరియు ఒడిశాలోని మరిన్ని నగరాల్లో ప్రారంభించింది.

ఎయిర్ టెల్

కస్టమర్‌లు హై-డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్‌కు సూపర్‌ఫాస్ట్ యాక్సెస్‌ని ఆస్వాదించవచ్చు

ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్ ఇప్పటికే గౌహతి, ఇంఫాల్, షిల్లాంగ్, అగర్తల, దిమాపూర్‌లలో అందుబాటులో ఉంది. ఇప్పటికే ఉన్న 4G SIM 5Gకు పనిచేస్తుంది. కొత్త SIMని కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. Airtel 5G Plusని యాక్టివేట్ చేయడానికి, స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్‌లకు వెళ్లి, మొబైల్ నెట్‌వర్క్‌ని ఎంచుకుని, Airtel SIMని ఎంచుకోవాలి ఇప్పుడు, Preferred Network typeను ఎంచుకుని, 5G నెట్‌వర్క్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. కస్టమర్‌లు హై-డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్‌కు సూపర్‌ఫాస్ట్ యాక్సెస్‌ని ఆస్వాదించవచ్చు. ఈ నగరాల్లోని ఎయిర్‌టెల్ కస్టమర్‌లు ఇప్పుడు అల్ట్రాఫాస్ట్ నెట్‌వర్క్‌ను పొందచ్చు ప్రస్తుత 4G వేగం కంటే 20-30 రెట్లు ఎక్కువ వేగాన్ని ఆస్వాదించవచ్చని ఈశాన్య రాష్ట్రాల ఎయిర్‌టెల్-సీఈఓ రజనీష్ వర్మ తెలిపారు.