
వార్షిక ప్లాన్ తో ఉచిత ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌ని అందిస్తున్న ఎయిర్‌టెల్
ఈ వార్తాకథనం ఏంటి
భారతి ఎయిర్‌టెల్ అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌లకు ఉచిత సబ్స్క్రిప్షన్ అందిస్తోంది, దానితో పాటు ఉచిత కాలింగ్, ఒక సంవత్సరం వ్యాలిడిటీ రోజుకు 2.5GB డేటా వంటి ప్రయోజనాలు కేవలం రూ. 3,359కే అందిస్తుంది.
ఈ రూ. 3,359 ప్రీపెయిడ్ ప్లాన్ మిగతవాటికన్నా ప్రత్యేకంగా ఉంటుంది. OTT యాక్సెస్‌తో పాటు, రీఛార్జ్ తేదీ నుండి పూర్తి సంవత్సరం పాటు డేటా అవసరాలు, పాన్-ఇండియా కాలింగ్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. దానితో పాటు, సబ్‌స్క్రైబర్‌లు రోజుకు 100 SMSలతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ (లోకల్ + STD) పొందుతారు. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో యాడ్-ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో (మొబైల్ ఎడిషన్) మరియు డిస్నీ+ హాట్‌స్టార్ (మొబైల్)కి ఉచిత సబ్స్క్రిప్షన్.
ఎయిర్ టెల్
రూ. 3,359 4G రీఛార్జ్ ప్లాన్ తో తాజా హై-స్పీడ్ 5G నెట్‌వర్క్ పొందచ్చు
రూ. 3,359 ప్లాన్ భారతదేశంలో అత్యంత ప్రయోజనకరమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఒకటి. వాయిస్, SMS, OTTలతో పాటు, మూడు నెలల అపోలో 24/7 సర్కిల్ సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100, క్యాష్‌బ్యాక్. ఉచిత హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ యాక్సెస్.
ప్రస్తుతానికి, ఎయిర్‌టెల్ తన 4G వినియోగదారులకు 5G సేవలను ఉపయోగించడం కోసం ఎటువంటి అదనపు రుసుమును వసూలు చేయడం లేదు. అంటే రూ. 3,359 4G రీఛార్జ్ ప్లాన్ తో తాజా హై-స్పీడ్ 5G నెట్‌వర్క్ పొందచ్చు. ఎయిర్ టెల్ వినియోగదారులకు 5G సపోర్ట్ ఫోన్ ఉంటే ఈ ప్లాన్ తో 5G సేవలను వినియోగించుకోవచ్చు.