రిలయన్స్ జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు, డేటా, కాలింగ్ ప్రయోజనాలను తెలుసుకుందాం
రిలయన్స్ జియో భారతదేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ. 2016లో కార్యకలాపాలను ప్రారంభించి సరికొత్త ఆఫర్లతో భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని పూర్తిగా మార్చింది. ఇది వచ్చినప్పటి నుండి ఆపరేటర్ రీఛార్జ్ ఆప్షన్ సిరీస్ ని పరిచయం చేసింది. ప్రస్తుతం భారతదేశంలోని వినియోగదారులకు అందుబాటులో ఉన్న అన్ని వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి తెలుసుకోండి. రిలయన్స్ జియో భారతదేశంలో వివిధ ఆప్షన్స్ తో అనేక రకాల ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఉన్నాయి. కంపెనీ వార్షిక రీఛార్జ్‌లలో అపరిమిత కాలింగ్, డేటా, SMS తో పాటు OTT సబ్‌స్క్రిప్షన్‌లు వంటి ప్రోత్సాహకాలు ఉంటాయి. ఈ దీర్ఘకాలిక ప్రీపెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌లు జియో వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటాయి, ఎందుకంటే అవి నెలవారీ రీఛార్జ్‌ల అవసరాన్ని తొలగిస్తాయి.
అర్హత ఉన్న కస్టమర్‌లు అదనపు ఖర్చు లేకుండా జియో 5G డేటాను ఉపయోగించుకోవచ్చు
రూ. 2,999 చెల్లించండి 388 రోజుల వ్యాలిడిటీ పొందండి. ఇది 999.5GB (912.5+87GB అదనపు) మొత్తం ఇంటర్నెట్ డేటాకు యాక్సెస్‌ని ఇస్తుంది, రోజుకు 2.5GB వస్తుంది.అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS, Jio యాప్‌ల సూట్‌కి ఉచిత యాక్సెస్‌ని పొందుతారు. మరో వార్షిక ప్లాన్ రూ. 2,879. ఇది 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 2GB పరిమితితో 730GB మొత్తం డేటా వస్తుంది. రూ.2,545తో రీఛార్జ్ తో 336 రోజుల వ్యాలిడిటీ. రోజుకు 1.5GB పరిమితితో 504GB మొత్తం ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. వీటితో పాటు అర్హత ఉన్న కస్టమర్‌లు అదనపు ఖర్చు లేకుండా జియో అపరిమిత 5G డేటాను ఉపయోగించుకోవచ్చు.