Page Loader
ఇండిగో విమానంలో మందుబాబుల రచ్చ.. ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులు
ఇండిగో విమానంలో అసభ్యకరంగా ప్రవర్తించిన ఇద్దరు అరెస్టు

ఇండిగో విమానంలో మందుబాబుల రచ్చ.. ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులు

వ్రాసిన వారు Stalin
Jan 09, 2023
03:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

విమానాల్లో అసభ్యకర సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎయిర్ ఇండియాలో తోటి మహిళా ప్రయాణికులపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన మరువకముందే.. ఇండిగో ఫ్లైట్‌లో మరో ఘటన జరిగింది. దిల్లీ నుంచి పాట్నాకు వెళ్తున్న విమానంలో ఇద్దరు ప్రయాణికులు మద్యం సేవించి రచ్చ రచ్చ చేశారు. ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అడ్డొచ్చిన విమాన కెప్టెన్‌పై దురుసుగా ప్రవర్తించారు. ఎయిర్‌లైన్ మేనేజర్ ఫిర్యాదు మేరకు సోమవారం వారిని అరెస్టు చేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. నిందితులపై ఎక్సైజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

ఇండిగో

బిహార్‌కు చెందిన వారిగా గుర్తింపు

విమానంలో తాగి రచ్చ చేసిన ఇద్దరు బిహార్‌కు చెందిన వారుగా విమానాశ్రయ వర్గాలు గుర్తించాయి. అంతేకాదు విరికి రాజకీయ నేపథ్యం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీ నేతలతో వీరికి సంబంధాలున్నట్లు సమాచారం. ప్రస్తుతం నిందితులిద్దరూ సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులో ఉన్నారు. ఎయిర్ ఇండియా విమానంలో ఓ వ్యక్తి పీకల దాకా తాగి.. ఆ మత్తులో తొటి మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన ఇటీవల జరిగింది. న్యూయార్క్ నగరంలోని జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం బిజినెస్ క్లాస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిపై ఎయిర్ ఇండియాతో పాటు పోలీసులు కూడా చర్యలు తీసుకున్నారు.