Bihar: బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి; కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్‌లోని నలందలో పొలంలో ఆడుకుంటూ మూడేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు.
దాదాపు 40 అడుగుల లోతులోని బోరుబావిలో పడిపోయిన చిన్నారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి జేసీబీ సాయంతో బాలుడి బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
చిన్నారి శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చిన్నారికి ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు.
బోరుబావిలో ఉన్న కెమెరా నుంచి బయటకు వచ్చిన చిత్రాల ఆధారంగా ప్రస్తుతానికి బాలుడు క్షేమంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
బిహార్
చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాం: అధికారులు
తాను పొలంలో పని పని చేస్తుండగా, తన కొడుకు పొలంలో ఆడుకుంటున్నట్లు బాలుడి తల్లి శివమ్మ చెప్పింది. ఈ క్రమంలో తన కొడుకు ఒక్కసారిగా కాలు జారి బోరుబావిలో పడినట్లు శివమ్మ పేర్కొంది.
గ్రామంలో సాగునీటి కోసం కొన్ని బోరుబావులు తవ్వారని, అందులోనే ప్రస్తుతం చిన్నారిపోయాడు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
చిన్నారిని రక్షించేందుకు కృషి చేస్తున్నామని, వైద్య బృందం, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కాపాడేందుకు డీఎస్పీ షిబ్లి నోమాని పేర్కొన్నారు.
త్వరలోనే చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకెళ్తామని ఆశిస్తున్నమని చెప్పారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రెస్క్యూ ఆపరేషన్ దృశ్యాలు
#WATCH | Nalanda, Bihar: "We received information that a child fell into a borewell...We are trying our best to rescue the child. NDRF & rescue team will be reaching the spot. The child is still alive, we can hear his voice...," says Silwa, Circle Officer, Shambhu Mandal. pic.twitter.com/iPgAqEWTeC
— ANI (@ANI) July 23, 2023