
బెంగుళూరులో జరగాల్సిన ప్రతిపక్షాల రెండో దఫా సమావేశం వాయిదా; కారణం ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరులో జులై 13, 14తేదీల్లో జరగాల్సిన ప్రతిపక్షాల రెండోదఫా సమావేశం వాయిదా పడింది. సమావేశాన్ని తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని జనతాదళ్ (యునైటెడ్) ముఖ్య అధికార ప్రతినిధి కేసీ త్యాగి చెప్పారు. అయితే ప్రతిపక్ష పార్టీల సమావేశం వాయిదా పడటానికి కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జూన్ 23న బిహార్‌లోని పాట్నలో ప్రతిపక్షాల సమావేశం విజయవంతమైంది. ఆ సమయంలో జులై 10, 12తేదీల్లో సిమ్లాలో రెండో దఫా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.
అయితే భారీ వర్షాల కారణంగా సమావేశం వేదికను సిమ్లా నుంచి బెంగళూరుకు మార్చారు.
సమావేశాన్ని వాయిదా వేయడానికి పార్లమెంట్‌తో పాటు పలు రాష్ట్రాల్లో వర్షాకాల సమావేశాల నిర్వహణ, మహారాష్ట్రలో ఎన్‌సీపీ సంక్షోభం కారణాలు తెలుస్తోంది.
ప్రతిపక్షాలు
సెప్టెంబర్‌లో రెండో దఫా సమావేశం?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 11న ముగుస్తాయి.
జులై 10నుంచి 14వరకు బిహార్ శాసనసభ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఈ నెలలో నిర్వహించాలని ఆలోచిస్తోంది.
బిహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తాము వర్షాకాల సమావేశాల్లో బిజీగా ఉన్నామని బెంగళూరులో విపక్షాల సమావేశాన్ని వాయిదా వేయాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరారు.
కర్ణాటకలో కూడా వర్షాకాల సమావేశాన్ని నిర్వహించబోతున్నందున వాయిదా వేయాలని తమ కేంద్ర నాయకత్వాన్ని రాష్ట్ర కాంగ్రెస్ కోరింది.
ఎన్సీపీ సంక్షోభం నేపథ్యంలో శరద్ పవార్ కూడా హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో రెండోదఫా సమావేశం సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.