Page Loader
దిల్లీలో వ్యక్తిని 3కిలో మీటర్లు ఈడ్చుకెళ్లిని కారు 
దిల్లీలో వ్యక్తిని 3కిలో మీటర్లు ఈడ్చుకెళ్లిని కారు

దిల్లీలో వ్యక్తిని 3కిలో మీటర్లు ఈడ్చుకెళ్లిని కారు 

వ్రాసిన వారు Stalin
May 01, 2023
11:44 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో కారు ఈడ్చుకెళ్లిన ఘటన మరొకటి జరిగింది. దిల్లీలోని ఆశ్రమ్‌చౌక్‌ నుంచి నిజాముద్దీన్‌ దర్గా వరకు ఆదివారం రాత్రి ఓ వ్యక్తిని కారు బానెట్‌కు తగిలించుకుని 3కిలో మీటర్లు పాటు లాక్కెళ్లింది. ఆ కారు బిహార్ ఎంపీ వీణాదేవికి చెందినదని పోలీసులు తెలిపారు. అయితే ఘటన సమయంలో ఎంపీ కారులో లేరు. కారు డ్రైవర్‌ను రామచంద్రగా గుర్తించామని, అతనిపై ర్యాష్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవగా, డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

దిల్లీ

రామచంద్ర కారును అడ్డగించిన పెట్రోలింగ్ పోలీసులు

బాధితుడిని క్యాబ్ డ్రైవర్ చేతన్‌గా గుర్తించారు. తాను ఒక ప్రయాణికుడిని డ్రాప్ చేసి తిరిగి వస్తుండగా, రామచంద్రు కారు తన వాహనాన్ని మూడుసార్లు తాకినట్లు చేతన్‌చెప్పాడు. దీంతో రామచంద్రను ఆపడానికి తన కారును దిగి, రామచంద్రు కారుకు అడ్డంగా నిలబడినట్లు వెల్లడించాడు. అయినా రామచంద్ర కారు నడపడం ఆపలేదని, ఈ క్రమంలో తాను అతని కారు బానెట్‌ను పట్టుకున్నట్లు చేతన్ చెప్పాడు. అయినా రామచంద్ర కారును ఆపకుండా ఆశ్రమ్ చౌక్ నుంచి నిజాముద్దీన్‌కు వరకు డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడని చేతన్ వెల్లడించాడు. తాను ఆపమని అడిగినా ఆపలేదని చేతన్ చెప్పాడు. ఆ తర్వాత రోడ్డుపై ఉన్న పెట్రోలింగ్ పోలీసులను తాను సాయం కోరడంతో వారు వచ్చి రామచంద్ర కారును అడ్డగించినట్లు పేర్కొన్నాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చేతన్‌ను ఈడ్చుకెళుతున్న కారు దృశ్యాలు