NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / IRCTC scam: లాలూ అనుచరులు, బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు
    తదుపరి వార్తా కథనం
    IRCTC scam: లాలూ అనుచరులు, బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు
    లాలూ అనుచరులు, బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు

    IRCTC scam: లాలూ అనుచరులు, బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు

    వ్రాసిన వారు Stalin
    Mar 10, 2023
    12:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులు, అనుచరుల ఇళ్లే లక్ష్యంగా ఈడీ శుక్రవారం సోదాలు నిర్వహిస్తోంది మూడు రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి.

    బిహార్‌లోని పాట్నాలో లాలూ ప్రసాద్ యాదవ్ అనుచరుడు అబు దోజానా ఇంట్లో ఈడీ అధికారులు ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు.

    బిహార్‌తో పాటు ఉత్తరప్రదేశ్, ముంబయిలోని లాలూ కుటుంబ సభ్యుల ఇళ్లను ఈడీ అధికారులు టార్గెట్ చేశారు.

    ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ను సీబీఐ ఈ కేసులో విచారణకు పిలిచిన కొద్ది రోజుల తర్వాత ఈడీ సోదాలు జరగడం గమనార్హం. ఇప్పటికే లాలూ భార్య రబ్రీ దేవిని కూడా సీబీఐ ప్రశ్నించింది.

    బిహార్

    గ్రూప్ డీ ఉద్యోగాల నియామకంలో అక్రమాలు జరిగాయాని అభియోగాలు మోపిన సీబీఐ

    2004నుంచి 2009 మధ్య కాలంలో రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో బిహార్‌లో గ్రూప్ డీ ఉద్యోగాల నియామకంలో లాలూ ప్రసాద్ యాదవ్ అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ అభియోగాలు మోపింది. ఉద్యోగం ఇప్పించి అనుచరులు, కుటుంబ సభ్యుల పేరు మీద భూమి తీసుకున్నట్లు సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొంది. భూమి రూపంలో ఆర్థిక ప్రయోజనాలను పొందినట్లు ఆరోపిస్తోంది.

    2018లో పట్నాలో నిర్మాణంలో ఉన్న మాల్‌ను ఈడీ సీజ్ చేసింది. దీనిని లాలూ ప్రసాద్ యాదవ్, అతని కుటుంబం నిర్మించారు. ప్రభుత్వం నుంచి క్లియరెన్స్‌ పొందకుండా బినామీ ఆస్తులతో మాల్‌ను నిర్మించారని బీజేపీ ఆరోపించింది.

    మాల్ నిర్మాణాన్ని అబు డోజానాకు చెందిన మెరిడియన్ కన్‌స్ట్రక్షన్ ఇండియా లిమిటెడ్ సంస్థ చేపట్టింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    లాలూ ప్రసాద్ యాదవ్
    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    బిహార్

    తాజా

    Earthquake: గ్రీస్‌లో 6.1 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ గ్రీస్
    Suryakumar Yadav : టీ20 క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన సూర్య‌కుమార్ యాద‌వ్‌.. ఆసియాలోనే ఒకే ఒక్క‌డు..  సూర్యకుమార్ యాదవ్
    MI vs DC : ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కి బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ.. 10 శాతం జ‌రిమానా.. ఢిల్లీ క్యాపిటల్స్
    USA: అత్యంత శక్తిమంతమైన మినిట్‌మ్యాన్‌-3 క్షిపణిని పరీక్షించిన అమెరికా..!  అమెరికా

    లాలూ ప్రసాద్ యాదవ్

    జాబ్ స్కామ్ కేసు: రబ్రీ దేవిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు సీబీఐ
    జాబ్ స్కామ్ కేసు: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం సీబీఐ

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    దిల్లీ లిక్కర్ స్కామ్‌: రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత పేర్లు దిల్లీ
    దిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ దిల్లీ
    దిల్లీ మద్యం కుంభకోణం: హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్ దిల్లీ
    తీహార్ జైలులో మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఈడీ దిల్లీ

    బిహార్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    Dream11 jackpot: రూ.49తో బెట్టింగ్ పెట్టి.. కోటీశ్వరుడైన డీజే వర్కర్ భారతదేశం
    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు నితీష్ కుమార్
    ఇండిగో విమానంలో మందుబాబుల రచ్చ.. ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులు దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025