
జాబ్ స్కామ్ కేసు: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగాల కుంభకోణం కేసులో సోమవారం రబ్రీ దేవిని విచారించిన సీబీఐ అధికారులు, మంగళవారం బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన కుమార్తె మిసా భారతిపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఉదయం దిల్లీలోని మిసా భారతికి చేరుకున్న సీబీఐ అధికారులు ఇద్దరిని విచారించారు.
2004నుంచి 2009 మధ్య కాలంలో రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో బిహార్‌లో గ్రూప్ డీ ఉద్యోగాలను డబ్బులు తీసుకొని లాలూ ప్రసాద్ యాదవ్ ఇచ్చినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. అక్రమంగా వచ్చిన డబ్బుతో యాదవ్ భూములను కొన్నారని అభియోగాలు మోపింది. ఆ భూములను వారి అనుచరుల పేరు మీద మళ్లించినట్లు సీబీఐ చెబుతోంది.
అనారోగ్యంతో ఉన్న ఆర్జేడీ అధినేతను విచారణ పేరుతో వేధించడంపై ప్రతిపక్షాలు కేంద్రంపై విరుచుకుపడుతున్నాయి.
బిహార్
కూతురు ఇంట్లోనే ఉంటున్న లాలూ
దిల్లీలోని పండారా పార్క్‌లోని మిషా భారతి నివాసానికి ఉదయం 10.40 గంటల ప్రాంతంలో ఐదుగురు సీబీఐ అధికారుల బృందం వచ్చారు. ప్రస్తుతం లాలూ ప్రసాద్ కూడా అక్కడే నివాసం ఉంటున్నారు.
అక్టోబర్ 2022న, లాలూ ప్రసాద్ యాదవ్, అతని భార్య రబ్రీ దేవి సహా 16మంది నిందితులపై నేరపూరిత కుట్ర, అవినీతి నేరాలకు సంబంధించిన కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
లాలూ ప్రసాద్‌తో పాటు మరికొందరిపై జరిగిన ప్రాథమిక విచారణ ఫలితాల మేరకు కేసు నమోదు చేసినట్లు సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొంది. మొత్తం 16మంది నిందితులకు మార్చి 15న సమన్లు జారీ చేసింది.