Loading...
Telangana: తెలంగాణలో ఫైర్‌ ఎన్‌వోసీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఇకపై కొత్త రూల్స్‌ అమలు
తెలంగాణలో ఫైర్‌ ఎన్‌వోసీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఇకపై కొత్త రూల్స్‌ అమలు

Telangana: తెలంగాణలో ఫైర్‌ ఎన్‌వోసీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఇకపై కొత్త రూల్స్‌ అమలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2026
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం ఫైర్‌ ఎన్‌వోసీ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. నివాస అపార్ట్‌మెంట్ల ఎత్తు పరిమితిని గతంలో ఉన్న 18 మీటర్ల నుంచి 24 మీటర్లకు పెంచింది. 24 మీటర్లకు మించి ఎత్తున్న భవనాలకు ఫైర్‌ టవర్‌ ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరి చేసింది. అలాగే,బేస్‌మెంట్‌లోని డీజీ (డీజిల్‌ జనరేటర్‌) రూముల వెంటిలేషన్‌ విషయంలో కొత్త వెసులుబాటు కల్పించింది. క్రెడాయ్‌, నరెడ్కో, బిల్డర్స్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులతో చర్చించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది.

వివరాలు 

భవనాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు..

ఈ మార్పులకు సంబంధించి తెలంగాణ అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్‌సింగ్‌ మాన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్త నిబంధనలు 2026 అక్టోబర్‌ 7 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఫైర్‌ ఎన్‌వోసీ ప్రక్రియను సరళీకరించడంతో పాటు భవనాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలను సమర్థంగా అమలు చేయడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫైర్‌ ఎన్‌వోసీ నిబంధనల్లో మార్పులు

ADVERTISEMENT