బిహార్: కుప్పకూలిన రూ.1,700కోట్ల బ్రిడ్జి; గార్డ్ గల్లంతు
బిహార్‌లోని భాగల్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. నాలుగు లేన్ల వంతెన ఆదివారం సాయంత్రం పేకమేడలా కూలిపోయిన వెంటనే బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుపడింది. అయితే దీనిపై స్పందించిన బిహార్ ప్రభుత్వం నిర్మాణంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగానే బ్రడ్జిని కూల్చేసినట్లు ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ అన్నారు. గతేడాది ఏప్రిల్ 30న ఈ వంతెన కొంత భాగం కూలిపోయిందని తేజస్వీ చెప్పారు. ఈ క్రమంలో వంతెనపై అధ్యయనం చేయడానికి నైపుణ్యం కలిగిన ఐఐటీ-రూర్కీని సంప్రదించినట్లు పేర్కొన్నారు. దీని నివేదిక ఇంకా రావాల్సి ఉందని పేర్కొన్నారు.
బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు
బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు డిప్యూటీ సీఎం తేజస్వీ అన్నారు. అనేక నిర్మాణ లోపాలను నిపుణులు ఎత్తి చూపారని పేర్కొన్నారు. మేము ఇప్పటికే చాలా హాని కలిగించేవిగా గుర్తించిన అనేక భాగాలను తీసేసినట్లు వెల్లడించారు. అయితే వంతెన దగ్గర పనిచేస్తున్నగార్డు కనిపించకుండా పోయాడని, రెస్క్యూ అధికారులు అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఈ వంతెనకు రూ.1,700 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నట్లు ఓ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు.