Page Loader
స్టార్టప్‌తో రిక్షా పుల్లర్ అద్భుతం; ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలిస్తున్నాడు
స్టార్టప్‌తో రిక్షా పుల్లర్ అద్భుతం; ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలిస్తున్నాడు

స్టార్టప్‌తో రిక్షా పుల్లర్ అద్భుతం; ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలిస్తున్నాడు

వ్రాసిన వారు Stalin
Apr 06, 2023
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

కష్టపడి పనిచేస్తే ఏదో ఒక రోజు ప్రతిఫలం వస్తుందని నిరూపించిన వారు ఈ ప్రపంచంలో ఎందరో మహానుభావులు ఉన్నారు. బిహార్‌కు చెందిన దిల్‌ఖుష్ కుమార్ కథ కూడా అలాంటి గొప్పవారికి ఏం తీసిపోనిది. ఒకప్పుడు రిక్షా పుల్లర్‌గా పనిచేసి, ఆ తర్వాత వీధుల్లో కూరగాయు అమ్మిన బిహార్‌లోని సహర్సా జిల్లాలోని బంగావ్‌‌ గ్రామానికి దిల్‌ఖుష్ కుమార్ ఇప్పుడు ఏకంగా కోట్ల విలువైన రాడ్‌బెజ్ అనే స్టార్టప్‌ను స్థాపించి ఇప్పుడు దానికి వ్యవస్థాపక సీఈవోగా ఉన్నారు. 12వ తరగతి వరకు చదవుకున్న దిల్‌ఖుష్ కుమార్ ఇప్పుడు ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయెట్లకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు.

బిహార్

సెకండ్ హ్యాండ్ టాటా నానోతో రాడ్‌బెజ్‌ కంపెనీ ప్రారంభం

దిల్‌ఖుష్ కుమార్ సొంతంగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించి బిహార్‌లో టాక్సీ సేవలు అందించాలనుకున్నాడు. ఇందుకోసం రోడ్‌బెజ్‌ అనే సంస్థను ప్రారంభించాడు. అయితే ఇది ఉబర్, ఓలా లాంటిది కాదు. ఇది టాక్సీ డ్రైవర్లతో కస్టమర్‌లను కనెక్ట్ చేసే డేటాబేస్ కంపెనీ. 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఈ కంపెనీ వాహనాలను అందిస్తుంది. ఇందులో పని చేయడానికి ఐఐటీ గౌహతి నుంచి గ్రాడ్యుయేట్లను తమ కంపెనీ కోసం నియమించుకున్నట్లు దిల్‌ఖుష్ చెప్పారు. దిల్‌ఖుష్ కేవలం సెకండ్ హ్యాండ్ టాటా నానోతో రాడ్‌బెజ్‌ను ప్రారంభించాడు. రాడ్‌బెజ్ ప్రారంభించిన 6-7 నెలల్లోనే దిల్‌ఖుష్ అతని బృందం రూ.4 కోట్ల విలువైన నిధులను సేకరించగలిగారు.

బిహార్

తన పాత రోజులను గుర్తు చేసుకుంటూ దిల్‌ఖుష్ భావోద్వేగం

డిజిటల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పాత రోజులను గుర్తు చేసుకుంటూ దిల్‌ఖుష్ కుమార్ భావోద్వేగానికి గురయ్యాడు. తాను దిల్లీలో రిక్షా పుల్లర్‌గా ఉండేవాడినని చెప్పాడు. పాట్నాలోని వీధుల్లో కూరగాయలు కూడా అమ్మేవాడినని వివరించారు. తాను గార్డు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు షూ పాలీష్ చేసుకోలేదని, చదువుకోలేదని తిరస్కరించారని చెప్పాడు. ఐఫోన్ లోగోను గుర్తించమని అడిగారని పేర్కొన్నారు. తాను ఆ ఫోన్‌ నమూనాను చూడటం అదే మొదటిసారి అని వివరించాడు. దిల్‌ఖుష్ తండ్రి బస్సు డ్రైవర్‌ కావడంతో అతని వద్ద డ్రైవింగ్ నేర్చుకున్నాడు. 12వ తరగతి తర్వాత డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో వాహనం నడపడం ప్రారంభించాడు.