Page Loader
కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు
కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ఇద్దరికి పాజిటివ్

కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు

వ్రాసిన వారు Stalin
Dec 26, 2022
06:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ ప్రయాణికుల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం బిహార్ విమానాశ్రయంలో నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలగా.. తాజాగా కోల్‌కతా ఎయిర్ పోర్టులో మరో ఇద్దరికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ఆ ఇద్దరు ప్రయాణికుల్లో ఒకరు మహిళ కాగా.. మరొకరు పురుషుడు. మహిళా ప్రయాణికురాలు బ్రిటన్ నుంచి కౌలాలంపూర్ మీదుగా కోల్‌కతాకు వచ్చారు. బిహార్ నివాసి అయిన మరో మరో ప్రయాణికుడు.. దుబాయ్ నుంచి వచ్చాడు. వైరస్ నిర్ధారణ అనంతరం ఆ ఇద్దరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ పంపినట్లు కోల్‌కతా విమానాశ్రయ వర్గాలు చెప్పాయి. బ్రిటన్ దేశస్థురాలును ప్రభుత్వ నిర్వహణలోని హాస్పిటల్‌లోని ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.

కరోనా

మయన్మార్ నుంచి వచ్చిన మరో నలుగురికి?

ఆదివారం పాజిటివ్‌గా తేలిన నలుగురు విదేశీయుల్లో ముగ్గురు థాయ్‌లాండ్‌కు చెందినవారు కాగా.. ఒకరు మయన్మార్‌ వాసి. వీరి నమూనాలను కూడా ఆదివారం జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు అధికారులు వెల్లడించారు. దిల్లీ విమానాశ్రయంలో కూడా మయన్మార్ నుంచి వచ్చిన నలుగురికి పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. గత‌వారం కూడా యూకేకు చెందిన 60 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్‌గా తెలింది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేయడానికి ముందే ఈ కేసును గుర్తించడం గమనార్హం. కేంద్రం ఆదేశాలతో విమానాశ్రయాల్లో స్ర్కీనింగ్ పరీక్షలు చేయాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో.. ఈ కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి.